TDP: నారా లోకేష్‎కు మంత్రి పదవి ఖాయమా.. టీడీపీ అధినేత నిర్ణయం ఇదే..

టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్‌‎కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కనుంది. ఆయనకు ప్రాధాన్యమున్న కీలక మంత్రిత్వశాఖలపై పగ్గాలు అప్పజెప్పే అవకాశముంది. ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. ప్రతి నియోజకవర్గంలో వేలల్లో మెజార్టీ సాధించారు అభ్యర్థులు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించడంపై అటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆనందం వ్యక్తం చేశారు.

TDP: నారా లోకేష్‎కు మంత్రి పదవి ఖాయమా.. టీడీపీ అధినేత నిర్ణయం ఇదే..
Nara Lokesh
Follow us
Srikar T

|

Updated on: Jun 07, 2024 | 7:20 AM

టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్‌‎కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కనుంది. ఆయనకు ప్రాధాన్యమున్న కీలక మంత్రిత్వశాఖలపై పగ్గాలు అప్పజెప్పే అవకాశముంది. ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. ప్రతి నియోజకవర్గంలో వేలల్లో మెజార్టీ సాధించారు అభ్యర్థులు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించడంపై అటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా నారా లోకేష్ పై ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్‎లో ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే నారా లోకేష్ ఎన్నికల్లో గెలిచాక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీపరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు. ఓట్ల లెక్కింపు ముగిశాక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిని శిరసావహిస్తానన్నారు. ఈ తరుణంలో మంత్రివర్గంలో లోకేశ్‌ చేరతారా, లేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లోనే కాకుండా అటు రాజకీయ పరంగా కూడా జోరుగా చర్చ జరుగుతోంది.

ఈ అంశంపై పలు సోషల్ మీడియా వేదికల్లో కూడా వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్, మరోసారి ఆ శాఖనే కేటాయిస్తారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. వీటిపై తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు స్పందించినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై, కేటాయించే పదవిపై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. క్యాబినెట్ బయట ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన కీలక విధానాలు, నిర్ణయాలు, వాటి అమల్లో భాగస్వామ్యం ఉండదన్న ఆలోచనతో మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఐటీ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రిగా నారా లోకేశ్‌ కొనసాగారు. అప్పట్లో విశాఖ, మంగళగిరి, విజయవాడ, అనంతపురం ఇలా పలు జిల్లా కేంద్రాల్లో ఐటీ, ఆటోమొబైల్స్ కంపెనీలు తీసుకురావడంలో కీలక పాత్రపోషించినట్లు చెబుతున్నారు పార్టీ ముఖ్యనేతలు. దీంతోపాటు నరేగా నిధులతో చాలా గ్రామాల్లో 25వేల కిలోమీటర్లకుపైగా పొడవైన సిమెంట్ రోడ్లను అందుబాటులోకి తెచ్చినట్లు కూడా చెబుతున్నారు. అందుకే ఈసారి కూడా లోకేష్ ను మంత్రి వర్గంలోకి తీసుకుని ఏదైనా కీలకమైన శాఖను కేటాయించి ఆయన సేవలను రాష్ట్రానికి ఉపయోగపడేలా చేయాలని భావిస్తోంది పార్టీ అధిష్టానం. దీనిపై త్వరలో మరింత స్పష్టత రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..