- Telugu News Photo Gallery Political photos Pawan Kalyan Says Thanks to Everyone Share Special Note telugu movie news
Pawan Kalyan: ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తాం.. పవన్ కళ్యాణ్ పోస్ట్..
పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై అటు సినీ పరిశ్రమలోని నటీనటులు, ఇటు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కు ఘన స్వాగతం పలికారు. మెగాస్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అన్నా లెజేనోవా, కుమారుడు అకీరాతో కలిసి తన అన్నయ్య చిరు ఇంటికి చేరుకున్న పవన్..
Updated on: Jun 06, 2024 | 9:19 PM

పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై అటు సినీ పరిశ్రమలోని నటీనటులు, ఇటు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కు ఘన స్వాగతం పలికారు.

మెగాస్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అన్నా లెజేనోవా, కుమారుడు అకీరాతో కలిసి తన అన్నయ్య చిరు ఇంటికి చేరుకున్న పవన్.. తల్లి అంజనమ్మ, అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలకు పాదాభివందనాలు చేశాడు. అనంతరం మెగా ఫ్యామిలీ మొత్తం కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా తన గెలుపుపై స్పందించి.. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తాము అందుకున్న విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికాగ పోస్ట్ చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధఇంచిన అఖండ విజయాన్ని అభినందిస్తూ చాలా మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక వేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత ఇలా ఉందరూ ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తెలుగు ఇండస్ట్రీలోని దర్శకులు, నటీనటులు, టెక్షీషియన్స్ అందరూ శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ పరిశ్రమలకు చెందిన శ్రేయోభిలాషులు ఆనందాన్ని తెలిపారు. ఏపీలో కూటమి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ విజయం మా అందరిపై బాధ్యతను మరింత పెంచింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తాం అని అన్నారు.

ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తాం.. పవన్ కళ్యాణ్ పోస్ట్..




