- Telugu News Photo Gallery Political photos Pawan Kalyan Meets PM Modi Along With His Wife and Son Akira Photos Goes Viral telugu movie news
Pawan Kalyan: తనయుడు అకీరాను మోదీకి పరిచయం చేసిన పవన్ కళ్యాణ్.. ఫోటోస్ వైరల్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ గెలుపొందారు జనసేన అధినేత..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఎన్టీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కురుమారు అకిరా నందన్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
Updated on: Jun 06, 2024 | 5:14 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ గెలుపొందారు జనసేన అధినేత..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఎన్టీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కురుమారు అకిరా నందన్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు.

ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన తనయుడు అకీరా నందన్‌ను ప్రధాని మోదీకి పరిచయం చేశారు పవన్. అలాగే మోదీకి చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించాడు అకీరా నందన్. అదే సమయంలో మోదీ అకీరా మీద చేయి పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతున్నారు.

ప్రధాని నివాసంలో పవన్ కళ్యాణ్ కుటుంబసమేతంగా మోదీని కలిసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో పవన్ విజయం సాధించినప్పటి నుంచి అకీరా నందన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. పవన్ ఇంటివద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోగా.. వారికి నమస్కరిస్తూ కనిపించాడు.

అలాగే తేదేపా అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు తన భార్య అన్నా లెజేనోవాతోపాటు తనయుడు అకీరాను తీసుకెళ్లారు. చంద్రబాబుకు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడంతో తండ్రిపై ప్రేమను చాటుతూ స్పెషల్ వీడియో షేర్ చేశాడు అకీరా నందన్.

పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2019లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో పవన్ కు పరాజయం ఎదురైంది. 2024లో పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు.




