AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP Final List: టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

ఏపీలో టీడీపీ ఫైనల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రకటించని పెండింగ్‎లో ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‎లో అధికారమే లక్ష్యంగా టీడపీ ముందుకు సాగుతోంది. ఎన్డీయేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల శంఖారావాన్ని మోగించింది.

TDP Final List: టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
Chandrababu Tdp
Srikar T
|

Updated on: Mar 29, 2024 | 4:29 PM

Share

ఏపీలో టీడీపీ ఫైనల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రకటించని పెండింగ్‎లో ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‎లో అధికారమే లక్ష్యంగా టీడపీ ముందుకు సాగుతోంది. ఎన్డీయేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల శంఖారావాన్ని మోగించింది. మొన్నటి వరకు చిత్తూరు జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రస్తుతం కర్నూలు జిల్లా బనగాన పల్లెలో ప్రచారం నిర్వహింస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ మొత్తం 144 అసెంబ్లీ, 17 లోక్ స‌భ‌ స్థానాలకు గాను ఇప్పటి వరకు 139 మంది శాసనసభ, 13 లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది.

మిగిలిన 9 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకు క్యాండిడేట్ల జాబితాను విడుదల చేసింది. గత కొంత కాలంగా చీపురు పల్లి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ చివరికి ఆ స్థానాన్ని కళా వెంకట్రావుకు కేటాయించారు. ఈ సీటుపై కళా వెంకట్రావు వర్గం ఆందోళనలు కూడా చేసింది. అలాగే కదిరి నియోజకవర్గంలో ముందుగా యశోద పేరును అనుకున్నప్పటికీ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ కు అవకాశాన్ని ఇచ్చింది.

అసెంబ్లీ అభ్యర్థులు..

  • రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం
  • అనంతపురం అర్బన్‌- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌
  • కదిరి- కందికుంట వెంకట ప్రసాద్‌
  • ఆలూరు- వీరభద్ర గౌడ్‌
  • గుంతకల్లు- గుమ్మనూరు జయరామ్
  • చీపురుపల్లి- కళా వెంకట్రావు
  • భీమిలి- గంటా శ్రీనివాసరావు
  • పాడేరు- కె. వెంకటరమేశ్‌ నాయుడు
  • దర్శి- గొట్టిపాటి లక్ష్మి

పార్లమెంట్ అభ్యర్థులు..

  • కడప- భూపేష్‌రెడ్డి
  • అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ
  • ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి
  • విజయనగరం- కలిశెట్టి అప్పలనాయుడు

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?