TDP: కాకినాడ జిల్లా టీడీపీలో బయటపడ్డ వర్గవిభేదాలు.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎదురుగానే..
ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకున్నారు. పిల్లి సత్తిబాబుకు నియోజకవర్గ ఇంచార్జ్ పదవి ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేయడంతో వివాదం..
కాకినాడ జిల్లా టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమావేశంలో గ్రూపు రాజకీయాలు వెలుగుజూశాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవిపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బండారు సత్యనారాయణ ఎదురుగానే రెండు గ్రూపులకు చెందిన కార్యకర్తలు గొడవపడ్డారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకున్నారు. పిల్లి సత్తిబాబుకు నియోజకవర్గ ఇంచార్జ్ పదవి ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేయడంతో వివాదం చెలరేగింది. ఆయనకు ఇన్‌చార్జి పదవి ఇవ్వొద్దంటూ మరో వర్గం నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.
మూడేళ్లుగా పిల్లి సత్తిబాబు దంపతులు పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించడంతో ఇరువర్గాల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. సమావేశంలో తలెత్తిన గొడవతో పిల్లి సత్యనారాయణ దంపతులు కంటతడి పెట్టారు. మరి ఈవివాదం ఇంతటితోనే ఆగిపోతుందా లేక అధిష్ఠానం దృష్టికి వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం..