ఎస్సీ కాలనీలో రాత్రి నిద్ర.. గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వినూత్న నిరసన..
విద్యుత్ బకాయిలు వసూలు వివాదం నడుస్తోంది. బిల్లులు పెండింగ్ ఉంటే విద్యుత్ కనెక్షన్లను అధికారులు తొలగిస్తున్నారు. ఏదైనా కాలనీలో పెద్ద సంఖ్యలో బిల్లులు పెండింగ్ ఉంటే ఆ కాలనీ మొత్తానికి..

గుంటూరు జిల్లాలో విద్యుత్ బకాయిలు వసూలు వివాదం నడుస్తోంది. బిల్లులు పెండింగ్ ఉంటే విద్యుత్ కనెక్షన్లను అధికారులు తొలగిస్తున్నారు. ఏదైనా కాలనీలో పెద్ద సంఖ్యలో బిల్లులు పెండింగ్ ఉంటే ఆ కాలనీ మొత్తానికి విద్యుత్ నిలిపి వేస్తున్నారు. ఈక్రమంలో వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఎస్సీ కాలనీలో పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఎన్ని సార్లు చెప్పిన స్థానికులు బిల్లులు చెల్లించలేదు. ఈనేపధ్యంలోనే కరెంటు నిలిపి వేశారు. గత మూడు రోజులుగా విద్యుత్ నిలిపోవేయటంతో మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత జీవీ ఆంజినేయులు ఆందోళను దిగారు.
ప్రజల సమస్యలను తెలిజేసేందుకు ఏకంగా కాలనీలో చీకట్లలో కాలనీ వాసులతో కలిసి నిద్రకు ఉపక్రమించారు. రాత్రంతా స్థానికులతోనే నిద్ర పోయిన జీవీ తెల్లవారిన తర్వాత అక్కడే కాల కృత్యాలు తీర్చుకొని ఆందోళనను కొనసాగించారు.
ప్రభుత్వం కాలనీకి విద్యుత్ పునరుద్దరించే వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు. జీవీ ఆందోళన నియోజకవర్గంలో రాజకీయాలను వేడెక్కించింది. వైసీపీ నేతలు జీవీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీడీపీ హాయాంలో విద్యుత్ ఉద్యమం చేసిన వారిపై కాల్పులు జరిపిన ఘటన మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో విద్యుత్ పై మాటల యుద్దం కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి: Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..!
