Chandrababu: ఏపీ సినిమా ఆన్ లైన్ టికెట్ విధానంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడానికి ప్రభుత్వం ఏమి చేయాలి.. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉన్న సమయంలో ఎలా సంపద సృష్టించాను..

Chandrababu: ఏపీ సినిమా ఆన్ లైన్ టికెట్ విధానంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
Chandra Babu Naidu
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 27, 2021 | 6:26 PM

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడానికి ప్రభుత్వం ఏమి చేయాలి.. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉన్న సమయంలో ఎలా సంపద సృష్టించాను అన్న విషయాన్నీ మళ్ళీ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ముందుగా, రోడ్లు, ఇతర ప్రాజెక్టుల ఉండాలని.. వీటివలనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెట్టడానికి , రాబడికి, ఉద్యోగాల కల్పనకు దోహదపడే వ్యాపారాలను ఆకర్షించాలన్నా.. ఇవే ప్రాధమిక మౌలిక సదుపాయాలని చెప్పారు. చంద్రబాబు.

అంతేకాదు తాను సీఎం గా ఉన్న సమయంలో హైదరాబాద్ లోని కోకాపేట భూముల విలువని ఎలా పెంచానో చెప్పారు. గత 25 ఏళ్ల క్రితం కోకాపేటలో ఏకం భూమి రూ. 20 వేల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదని.. అయితే ఆ భూముల విలువ.. హైటెక్ సిటీ, సైబరాబాద్ వంటి నిర్మాణాలతో  పెరిగాయని.. ఇప్పుడు అక్కడ ఎకరం కోట్లకు చేరుకుందని.. ఇది సంపద సృష్టించడం అంటరాని చెప్పారు.

ఇలాగె అమరావతి భూమికూడా వచ్చేదని ఇప్పటి ప్రభుత్వం మొత్తం నాశనం చేసిందంటూ కామెంట్స్ చేశారు.  అంతేకాదు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రాష్ట్ర భవిష్యత్తు అవకాశాలనుపట్టించుకోవడం తీసుకోకుండా అప్పులు చేస్తూనే ఉన్నారని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ టిక్కెట్ల విధానంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ప్రజలు ఏమనుకుంటారో అని కూడా లేకుండా అప్పులు తీసుకుంటున్నారు.. డబ్బులన్నీ అయ్యాక హోసింగ్ వన్ టైం సెటిల్‌మెంట్‌ పథకానికి సీఎం జగన్‌ కారణమని ఆరోపించారు.

Also Read:  భారీ వర్షంలో జంట పాముల నృత్యం.. అద్భుతమైన నాట్యం అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్