Tomato Prices Falling: ఏపీలో అక్కడ ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర.. కిలో రూ.10 నుంచి రూ.27 మాత్రమే..
Tomato Prices Falling: వర్షాలు, వరదల నేపథ్యంలో నిన్నమొన్నటి వరకూ ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఒక్కసారిగా దిగి వచ్చాయి. కిలో సెంచరీపైగా పలికిన టమాటా ఇప్పుడు ఒక్కసారిగా..
Tomato Prices Falling: వర్షాలు, వరదల నేపథ్యంలో నిన్నమొన్నటి వరకూ ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఒక్కసారిగా దిగి వచ్చాయి. కిలో సెంచరీపైగా పలికిన టమాటా ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో మొన్నటి వరకూ కిలో రూ.100 లకు పైగా ఉండగా.. శనివారం టమాటా ధర గరిష్టంగా రూ. 27 లు పలకగా, కనిష్టంగా రూ.10 లు పలికింది. టమాటా రేటు రెగ్యులర్ కి చేరుకోవడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. రైతులు మాత్రం పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇలా ఒక్కసారిగా టమాటా ధర పడిపోవడానికి కారణం.. ఇతర రాష్ట్రల నుంచి దిగుబడి పెరగడంతోనే అంటున్నారు మార్కెట్ నిపుణులు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి కావడం వల్ల ధరలు తగ్గాయని పత్తికొండ వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఒక్కసారిగా ఇలా ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అంటే తమకు రవాణా ఖర్చులు కూడా రావంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రైతులు.. తమ దగ్గర తక్కువ ధరకు కొని.. ఇతర ప్రాంతాల్లో భారీ ధరలకు అమ్ముతున్నారని సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తూ.. కిలోలకు కిలోలు కొనుగోలు చేస్తున్నారు.
Also Read: ‘మా’ ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా మంచు విష్ణు.. పలు ఆస్పత్రులతో ఒప్పందాలు..