Viral Video: భారీ వర్షంలో జంట పాముల నృత్యం.. అద్భుతమైన నాట్యం అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్
Viral Video: స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత .. తమ సమీపంలో ఏ వింతలు విశేషాలు జరిగినా వెంటనే వాటిని చిత్రీకరిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో..
Viral Video: స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత .. తమ సమీపంలో ఏ వింతలు విశేషాలు జరిగినా వెంటనే వాటిని చిత్రీకరిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఎక్కువగా జంతువుల వీడియోలు, ఫన్నీ వీడియోలతో పాటు పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రెండు పాములు జంటగా.. సయ్యాటలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ‘జోహో సీఈఓ’ శ్రీధర్ వెంబు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో రెండు పసుపు రంగు పాములు వర్షాన్ని ఆస్వాదిస్తున్నట్లున్నాయి. తమని తాము మరచి ఈ రెండుపాములు లయతో నాట్యం చేస్తున్నాయి. ఈ వీడియో షేర్ చేసిన శ్రీధర్.. తమిళనాడులోని తెన్‌కాశిలో చిత్రీకరించబడిందని తెలిపారు.
తెన్‌కాశిలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో చోటు చేసుకున్న అద్భుతమైన దృశ్యం.. ఈ జంట పాము నృత్యం. షికారుకి వెళుతున్నసమయంలో తన కంటికి కనిపించిన ఈ నాట్యాన్ని ఫోన్ లో చిత్రీకరించి.. ఈ వీడియో షేర్ చేసిన AksUnikకి ధన్యవాదాలు” కూడా చెప్పారు శ్రీధర్. ఇప్పటి వరకూ నల్లతాచు, నాగపాములు నాట్యం చూశామని అయితే ఇలా పసుపు రంగు పాములు నాట్యం చేయడం చూడడం చాలా అరుదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్స్, లైక్స్ తో హల్ చల్ చేస్తోంది.
Amazing snake dance that happened today during heavy rains here in Tenkasi.
Thanks to @AksUnik who caught this on her phone while going for a walk. pic.twitter.com/uVp4YqYdH8
— Sridhar Vembu (@svembu) November 26, 2021
Also Read: ఆ దేశంలో వింత ఆచారం.. దెయ్యానికి పెళ్లి.. 3 వేల ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం