AP Weather Report: ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. ఇవి వివరాలు

ఏపీలో పలు చోట్ల చెదురు మదురు జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తక్కువ ఎత్తులో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయని.. వాటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

AP Weather Report: ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. ఇవి వివరాలు
Ap Rains
Follow us

|

Updated on: Sep 15, 2021 | 2:18 PM

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  నిన్నటి వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆంధ్రప్రదేశ్ నుండి దూరంగా వెళ్లిపోయిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.

వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన 

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ————————————————— ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : —————————— ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ———————- ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో సైతం వర్షాలు

తెలంగాణ‌లో నేడు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావార‌ణ శాఖ హెచ్చ‌రించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. ముఖ్యంగా ములుగు, పెద్ద‌ప‌ల్లి మంచిర్యాల‌, కొమురంభీమ్, భూపాల్ ప‌ల్లి, జ‌గిత్యాల‌, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ శాక వెల్ల‌డించింది.

Also Read:  హైవేలపై అణువణువు జల్లెడ.. అదే ఇప్పుడు కీలక ఆధారం.. నిందితుడు గుండు చేయించుకున్నాడా..?