AP Weather: మరో అల్పపీడనం ముప్పు.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన

రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణల్లోని మరికొన్ని ప్రాంతముల నుంచి,  కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయని వాతవరణ శాఖ వెల్లడించింది.

AP Weather: మరో అల్పపీడనం ముప్పు.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన
AP Telangana Rains
Follow us

|

Updated on: Oct 13, 2021 | 4:56 PM

నైరుతి రుతుపవనాల తిరోగమన రేఖ కోహిమా, సిల్చార్,  కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణల్లోని మరికొన్ని ప్రాంతముల నుంచి,  కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక తూర్పుమధ్య బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావము వలన రాగల 24 గంటలలో అదే ప్రాంతములలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. తదుపరి 24 గంటలలో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిషా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతము తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి 13°N అక్షాంశము వెంబడి తూర్పుమధ్య బంగాళాఖాతం & దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది కర్ణాటక తీరానికి దగ్గరగా తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతములో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టానికి 4.5 km నుండి 5.8 km ఎత్తుల మధ్య కొనసాగుతోంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ————————————————— ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : —————————— ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ———————- ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ‌ ‌ Also Read: రాజీనామాపై మరోసారి నాగబాబు స్పష్టత.. ‘చిరంజీవి అలా ఎప్పుడూ అనుకోలేదని కామెంట్’

ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన నరేశ్.. సంచలన వ్యాఖ్యలు