AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్ పోటీ చేసేదెక్కడ..? పరిశీలనలోకి మరో రెండు కొత్త నియోజకవర్గాలు!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ కొనసాగుతుంది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 24సీట్లలో పవన్‌ కల్యాణ్‌ పోటీచేస్తున్న స్థానాన్ని ప్రకటించకపోవడంపై హాట్‌టాఫిక్‌ మారింది. రెండు రోజుల క్రితం భీమవరంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్ అక్కడి తెలుగుదేశం, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. తాను భీమవరం నుంచి పోటీ చేస్తున్నాననే సంకేతాలు క్యాడర్‌లోకి పంపారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్ పోటీ చేసేదెక్కడ..? పరిశీలనలోకి మరో రెండు కొత్త నియోజకవర్గాలు!
Pawan Kalyan
Shaik Madar Saheb
|

Updated on: Feb 25, 2024 | 11:55 AM

Share

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ కొనసాగుతుంది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 24సీట్లలో పవన్‌ కల్యాణ్‌ పోటీచేస్తున్న స్థానాన్ని ప్రకటించకపోవడంపై హాట్‌టాఫిక్‌ మారింది. రెండు రోజుల క్రితం భీమవరంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్ అక్కడి తెలుగుదేశం, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. తాను భీమవరం నుంచి పోటీ చేస్తున్నాననే సంకేతాలు క్యాడర్‌లోకి పంపారు. పవన్‌ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే అంతా సహకరిస్తామని అటు టీడీపీ నేతలు సైతం చెప్పుకొచ్చారు. అటు జనసేన నేతలు సైతం తమ నాయకుడు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఏముంది పవన్ కల్యాణ్ ప్రకటించడమే తరువాయి అనుకున్నారంతా.. కానీ నిన్న జనసేన సీట్ల ప్రకటనలో పవన్‌.. తాను పోటీ చేసేది ఎక్కడి నుంచో చెప్పకపోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. పవన్‌ ఎక్కడో నుంచి పోటీ చేస్తారో తెలియక క్యాడర్ అయోమయంలో పడింది. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నుంచి, నారా లోకేష్‌ మంగళగిరి నుంచి పోటీ చేస్తానని ప్రకటించినా.. పవన్‌ పోటీ చేస్తున్న స్థానాన్ని ప్రకటించకపోవడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. భీమవరం ప్రకటన విషయంలో మాత్రం పవన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారనే దానిపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.

గతంలో భీమవరం, గాజువాకలో పోటీచేసిన పవన్

గతంలో పవన్‌ కల్యాణ్‌ భీమవరం, గాజువాకలో పోటీ చేశారు. ఓటమి తర్వాత అటువైపు చూడలేదు. పవన్ ప్రస్తుతానికి భీమవరం నుంచే పోటీ చేస్తారని మొదట నుంచి చెబుతున్నప్పటికీ కూడా ఆయన మరో స్థానం నుంచి బరిలో దిగే ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. అందులో భాగంగానే పిఠాపురం, కాకినాడ పేర్లు పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈరెండు నియోజకవర్గాల్లో బలమైన కాపు సామాజిక వర్గంతో పాటు జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉందనే లెక్కలతో అటువైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది.. టోటల్‌గా భీమవరం లేదా, కాకినాడ, పిఠాపురంలో ఏదో ఒక స్థానం నుంచి పవన్ పోటీ చేసే అవకాశమైతే లేకపోలేదు. ఇక ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాపై ప్రధానంగా స్పెషల్ ఫోకస్ చేశారు పవన్ కల్యాణ్..

ముఖ్యంగా రాయలసీమలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలపై పవన్ గురిపెట్టారు. బలిజ సామాజిక వర్గం అధికంగా ఉండే కడప, అనంతపురం జిల్లాల పరిధిలో రాజంపేటతో పాటు మిగతా నియోజకవర్గాల్లో తమపార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలని పవన్ భావిస్తున్నారు. అందుకే ప్రజెంట్ జనసేనకు కేటాయించిన 24 సీట్లలో ఇప్పటికే ఐదుగురిని ప్రకటించిన పవన్.. అభ్యర్థుల ఎంపికలో ఆచీతూచీ అడుగులు వేసి.. టోటల్‌గా రెండుమూడురోజుల్లో ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే