YS Jagan: 2024 ఎన్నికలకు మేం సిద్ధం.. 15 లక్షల మందితో వైసీపీ భారీ బహిరంగ సభ..

Addanki Siddam Sabha: భీమిలిలో వైసీపీ సమరశంఖం పూరించింది. దెందులూరులో యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. రాప్తాడు సభతో వైసీపీ దమ్మేంటో చూపించింది. ఇక చరిత్రలో నిలిచిపోయేలా అద్దంకిలో సిద్ధం ముగింపు సభకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. ఇంతకీ ఈ సభకు ఏయే పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు రాబోతున్నారు? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎన్ని లక్షల మంది హాజరుకానున్నారు.. అనేది ఆసక్తికరంగా మారింది.

YS Jagan: 2024 ఎన్నికలకు మేం సిద్ధం.. 15 లక్షల మందితో వైసీపీ భారీ బహిరంగ సభ..
YS Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 25, 2024 | 11:33 AM

Addanki Siddam Sabha: భీమిలిలో వైసీపీ సమరశంఖం పూరించింది. దెందులూరులో యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. రాప్తాడు సభతో వైసీపీ దమ్మేంటో చూపించింది. ఇక చరిత్రలో నిలిచిపోయేలా అద్దంకిలో సిద్ధం ముగింపు సభకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. ఇంతకీ ఈ సభకు ఏయే పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు రాబోతున్నారు? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎన్ని లక్షల మంది హాజరుకానున్నారు.. అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కొంతవరకు కసరత్తు పూర్తి చేసిన సీఎం జగన్.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోకి దిగారు. సిద్ధం పేరుతో ఏపీలోని నాలుగు ప్రాంతాలను కవర్ చేసేలా భారీ బహిరంగ సభలకు వైసీపీ ప్లాన్ చేసింది వైసీపీ. అందులో భాగంగా భీమిలిలో నిర్వహించిన తొలి సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండో సిద్ధం సభతో దెందులూరు దద్దరిల్లింది. ఇక రాప్తాడుకు జనసంద్రమే తరలివచ్చింది. అంతకు మించి అనేలా.. రాయలసీమ చరిత్రలోనే ఏ సభకూ రానంత మంది జనం ఈ సభకు హాజరయైనట్టు పార్టీ స్పష్టం చేసింది. వైసీపీ లెక్కల ప్రకారం ఈ సభకు 10లక్షల మంది హాజరయ్యారు.

మేదరమెట్లలో 200 ఎకరాల్లో ముగింపు సభ

ఇక నాలుగో సభ.. ముగింపు సభను అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాప్తాడు సభను 110 ఎకరాల్లో ఏర్పాటు చేస్తే.. ముగింపు సభ కోసం 200 ఎకరాలు సేకరించారు. వచ్చే నెల 3న జరిగే ఈ సభకు నెల్లూరు, తిరుపతి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 54 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాల్ని తరలించేందుకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. ఈ ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి నిర్వహించారు. 15 లక్షల మంది ఈ సభకు వస్తారని ఆయన అంచనా వేశారు.

మొత్తంగా ఇది చివరి సిద్ధం సభ కావడంతో మిగతా మూడు సభలను తలదన్నేలా విజయవంతం చేయడానికి పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సిద్ధం సభలు పూర్తైన తర్వాత.. పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి.. తదుపరి ఎన్నికల ప్రచారం, సభలకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయనున్నారు సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..