Sunday Fish Market: చిత్రాయి చేపల కోసం.. కృష్ణానది కరకట్టకు క్యూ కడుతున్న జనం.. ధర ఎంతో తెలిస్తే షాక్..
నదిలో దొరికే చిత్రాయి చేప రుచి వేరు అంటున్నారు నాన్ వెజ్ ప్రియులు. డిమాండ్ పెరగడంతో చేపల ధర ఆకాశానికి చేరుకుంది. చేపలు.. కిలో రూ. 350లకు అమ్ముతుండగా.. కిలో రొయ్యలు రూ. 500 లకు అమ్ముతున్నారు.
Sunday Fish Market: ఆదివారం వచ్చిందంటే నాన్వెజ్ మార్కెట్లు భోజన ప్రజలతో కిటకిటలాడుతుంటాయి. చికెన్ (Chicken), మటన్ (Mutton)అధికంగా తింటే మంచిది కాదని డాక్టర్ లు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయంగా సీఫుడ్ కు గిరాకీ పెరిగింది. ముఖ్యంగా చేపలకు కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులోనూ చెరువు చేప కన్నా నదిలో దొరికే చేప కి మరింత డిమాండ్ ఉంది. కృష్ణా నదిలో దొరికే చేప కోసం జనాలు క్యూ కడుతున్నారు.. నదిలో దొరికే చిత్రాయి చేప రుచి వేరు అంటున్నారు నాన్ వెజ్ ప్రియులు. డిమాండ్ పెరగడంతో చెరువులో పట్టిన చేపలను కూడా కృష్ణ నది తీర ప్రాంతానికి తీసుకువచ్చి కొంత మంది సొమ్ము చేసుకుంటున్నారు.
స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు చిత్రాయి చేప కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు. దీంతో చేపల ధర ఆకాశానికి చేరుకుంది. చేపలు.. కిలో రూ. 350లకు అమ్ముతుండగా.. కిలో రొయ్యలు రూ. 500 లకు అమ్ముతున్నారు. ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చెరువు చేపలు తెచ్చి కృష్ణా నది చేపలంటూ మరికొందరు అమ్మకాలు చేబడుతున్నారు. ఇక్కడ చేపల కోసం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కృష్ణానది కరకట్ట కు జనం క్యూ కడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..