AP Crime News: పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా విద్యార్థిపై కత్తులతో దాడి.. పోలీసుల విచారణలో సంచలనాలు

విశాఖ వన్‌టౌన్‌ ప్రాంతంలో టెన్త్‌ విద్యార్ధిపై దాడి కేసులో 10మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. వారిలో రౌడీషీటర్‌ వాసుపల్లి చిన్న, దండుపాళ్యం బ్యాచ్‌ సభ్యులున్నారు.

AP Crime News: పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా విద్యార్థిపై కత్తులతో దాడి.. పోలీసుల విచారణలో సంచలనాలు
Arrest
Follow us
Balaraju Goud

|

Updated on: May 08, 2022 | 8:53 AM

Student Murder Attempt Case: విశాఖ వన్‌టౌన్‌ ప్రాంతంలో టెన్త్‌ విద్యార్ధిపై దాడి కేసులో 10మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. వారిలో రౌడీషీటర్‌ వాసుపల్లి చిన్న, దండుపాళ్యం బ్యాచ్‌ సభ్యులున్నారు. అయితే అరెస్ట్‌ చేసే క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు నిందితుల కుటుంబసభ్యులు. పోలీసులకు అడుగడుగునా అడ్డు తగలడంతో పాటు దాడికి యత్నించారు. దీంతో భారీ బందోబస్తు మధ్య నిందితులను కోర్టుకు, అక్కడి నుంచి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో టెన్త్ విద్యార్థి అరవింద్ పై హత్యాయత్నం కేసులో పది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో రౌడీ షీటర్ వాసుపల్లి చిన్న అలియాస్ ఎలకడు.. డండుపాల్యం బ్యాచ్ సభ్యులు ఉన్నారు. అయితే అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు నిందితుల కుటుంబ సభ్యులు, సహచరులు. అటు పోలీస్ స్టేషన్ లో పాటు కోర్టు వరకు పోలీసులకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. మరికొంతమంది పోలీసులపైకి వెళ్లారు. దింతో భారీ బందోబస్తు మధ్య నిందితులను కోర్టు కు, అక్కడి నుంచి సెంట్రల్ జైలుకు తరలించ్చారు పోలీసులు.

నిన్న పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా అరవింద్ అనే విద్యార్థిపై కత్తితో దాడి చేశారు కొంతమంది యువకులు. పరీక్ష రాసి అరవింద్ తిరిగి వెళ్తుండగా కత్తులతో దాడి చేశారు. ఆటో ఎక్కుతుండగా ఒక్కసారిగా ఏటాక్ చేయడంతో పరుగులు పెట్టాడు అరవింద్. వారి నుంచి తప్పించుకున్నాడు. అరవింద్ తల, మోచేయి, పక్క లో గాయ్యాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అరవింద్ను కేజీహెచ్ కు తరలించ్చారు.

ఇవి కూడా చదవండి

కేసు నమోదు చేసిన పోలీసులు.. పాత కక్షలే కారణంగా పోలీసులు తేల్చ్చారు. అయితే బాదితుడు స్టేట్ మెంట్ ప్రకారం రెల్లి వీధి, ఏవిఎన్ కాలేజ్ ప్రాంతంలోని దండుపాల్యం బ్యాచ్ పనిగా నిర్ధారించిన పోలీసులు.. రౌడీ షీటర్ వాసుపల్లి చిన్న అలియాస్ ఎలక, వేను, కిరణ్, సుధీర్, దుర్గా ప్రసాద్, మణి కంఠ సహా పదిమందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో కొంతమంది పాఠానేరస్థులు ఉన్నారు. అయితే.. ఒక్కొక్కరిని అరెస్ట్ చేసే క్రమంలో నిందితుల కుటుంబ సభ్యులు, సహచరుల నుంచి పోలీసులకు ఉహించని పరిణామాలు ఎదురయ్యాయి. అకారణంగా అరెస్ట్త చేస్తున్నారని కొందరు.. తమవారిని విడిచి పెట్టాలంటు మరికొందరు వాగువాడానికి దిగారు.

పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు పోలీసులకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. తోలుత పోలీస్ స్టేషన్లో పోలీసులతో వాగువాడానికి దిగారు. ఆ తరువాత నిందితులను కోర్టు కు తరలిస్తున్నారని తెలుసుకుని అక్కడకు భారీగా చేరుకున్నారు. మరికొంతమంది పోలీసులపైకి వెళ్లారు. ఒక్కానోక సమయంలో దాడికి యత్నింంచ్చారు. దింతో భారీ బందోబస్తు మధ్య నిందితులను కోర్టు కు, అక్కడి నుంచి సెంట్రల్ జైలుకు తరలించ్చారు పోలీసులు.

అరవింద్ పై దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు తేల్చ్చారు. కొద్దీ నెలల క్రితం అరవింద్ కుటుంబానికి, నిందితుల్లో కొందరి మధ్య వాగ్వివాదం, దాడులు జరిగాయి. ఆ కేసులో కొంతమంది జైలుకు కూడా వెళ్లారు. మళ్లీ ఇప్పుడు కక్షలతో అరవింద్ పై దాడి కి పాల్పడ్డారు. అయితే.. నిందితుల్లో వాసుపల్లి చిన్న అలియాస్ ఎలక తో పాటు కొంతమంది దండు పాల్యం బ్యాచ్ సభ్యులు ఉండడంతో పోలీసులు వారిని పట్టుకోవడం, ఆ తరువాత కోర్టుకు, జైలుకు తరలించే క్రమంలో శ్రమించ్చాల్సి వచ్చింది. చివరకు పది మందిని రిమాండ్ కు తరలించి ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు.