AP News: ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కట్ చేస్తే నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్..

AP News: వారిద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. పెళ్లికి కూడా పెద్దలను ఒప్పించారు. తీరా పెళ్లి చేసుకునే సమయానికి ప్రియురాలి నగ్న చిత్రాలతో యువతి తండ్రినే బ్లాక్‌మెయిల్‌ చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని..

AP News: ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కట్ చేస్తే నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: May 08, 2022 | 8:55 AM

AP News: వారిద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. పెళ్లికి కూడా పెద్దలను ఒప్పించారు. తీరా పెళ్లి చేసుకునే సమయానికి ప్రియురాలి నగ్న చిత్రాలతో యువతి తండ్రినే బ్లాక్‌మెయిల్‌ చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శృంగవరపుకోటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ సహాయకుడిగా పనిచేస్తున్నాడు శ్రీరెడ్డి నవీన్‌ అనే యువకుడు.

అదే సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినితో స్నేహం కలిసి. ఇలా కొన్ని రోజుల పాటు స్నేహితులుగా ఉన్న వారు ప్రేమించుకున్నారు. రెండేళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం సాగింది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరు కుటుంబ సభ్యులు వారి వివాహానికి అంగీకరించారు. తీరా పెళ్లి సమయం దగ్గరపడుతోన్న సమయంలో నవీన్‌ ఓ మెలిక పెట్టాడు. తాను ఇల్లు కడుతున్నానని, ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పాడు. అంతటితో ఆగకుండా ఇంటి నిర్మాణానికి కావాల్సిన డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. నవీన్‌ వ్యవహార శైలిపై అనుమానించిన యువతి తండ్రి డబ్బు ఇచ్చేది లేదని చెప్పాడు.

దీంతో నవీన్‌ బ్లాక్‌మెయిల్‌కు తెర తీశాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన నగ్న చిత్రాలను యువతి తండ్రి ఫోన్‌కు పంపించి బెదిరించడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..