Firing in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం.. నడిరోడ్డుపై అత్యంత రద్దీ ప్రాంతంలో హత్యాయత్నం!

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి తుపాకీ చప్పులతో దద్దరిల్లింది. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్‌ నగర్‌లో 10రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు.

Firing in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం.. నడిరోడ్డుపై అత్యంత రద్దీ ప్రాంతంలో హత్యాయత్నం!
Firing In Delhi
Follow us
Balaraju Goud

|

Updated on: May 08, 2022 | 8:33 AM

Firing in Delhi: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి తుపాకీ చప్పులతో దద్దరిల్లింది. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్‌ నగర్‌లో 10రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఓ కారులో ఉన్న వ్యక్తులపై విచ్చలవిడిగా ఫైరింగ్‌ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. జనావాసాల్లో జరిగిన కాల్పులతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. సీసీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి, ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను పెంచామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ఇవి కూడా చదవండి

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 16న నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో జరిగిన ఘర్షణల తర్వాత పశ్చిమ ఢిల్లీలో కాల్పుల ఘటన కొన్ని వారాల తర్వాత తెరపైకి వచ్చింది. ఈ హింసాకాండలో పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా రాళ్లు రువ్వి కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. పరస్పర శత్రుత్వం కారణంగానే ఈ కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని అజయ్ చౌదరి, జస్సా చౌదరిగా గుర్తించారు. అజయ్ చౌదరి కాషోపూర్ మండి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ