Mother’s Day 2022: అమ్మగా.. ఆప్తురాలిగా.. 35 ఏళ్లుగా వందలమంది అనాథలకు తల్లిగా మారిన మహిళా శిరోమణి వాణి..

అమ్మప్రేమ కోసం దేవుడుకూడా మనిషిగా పుట్టాడని అంటారు. అంతగొప్ప అమ్మప్రేమకు సలాం చేస్తోంది యావత్ ప్రపంచం.. ఈరోజు మదర్స్ డే సందర్భంగా కామాక్షి పీఠం (ఆశ్రమం) లో ఉన్న అనాధల బాధకు అమ్మగా మారిన ఓ మహిళను ఈరోజు ప్రపంచానికి TV9 పరిచయం చేస్తోంది. 

Mother's Day 2022: అమ్మగా.. ఆప్తురాలిగా.. 35 ఏళ్లుగా వందలమంది అనాథలకు తల్లిగా మారిన మహిళా శిరోమణి వాణి..
Kamakshi Peetam
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2022 | 7:58 AM

Mother’s Day 2022: ప్రపంచంలోని అత్యంత విలువైనది తల్లిబిడ్డల అనుబంధం.. తల్లంటే పిల్లలకు.. పిల్లలంటే తల్లికి వెలకట్టలేని ప్రేమ ఉంటుంది. బిడ్డల కోసం తన అందమైన ప్రపంచాన్ని, కోరికలను తల్లి త్యాగం చేస్తుంది. అందుకే తల్లి అంటే పిల్లలకు ఎనలేని ప్రేమ ఉంటుంది. ఈ క్రమంలో తల్లుల కోసం ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించారు… మే 8న అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని(International mother’s day) ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

తల్లి ఒడి బిడ్డకు తొలి బడి..అమ్మ లేకపోతే సృష్టికి అస్థిత్వమే లేదు, సృజనకు ఆస్కారమే లేదు. ఆకలికి ఉపశమనమే లేదు…అనురాగానికి ఉనికే లేదు…చివరకు ప్రేమకూడా బ్రాంతి మాత్రమే అవుతుంది. అమ్మ ఉన్న ఇల్లు ఓ నందనవనంలా ఉంటుంది. పూరిపాకైనా ఓ పూజామందిరంలా మారి పవిత్రమవుతుంది…. అలాంటి అమ్మ ప్రేమకు కు చాలా మంది దూరంగా ఉంటూ అనాథలుగా అనాధ ఆశ్రమాలలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు…. ఎలాంటి ఇబ్బంది లేకుండా తానే అమ్మాయి ఆడపిల్లలను చదువు దగ్గరనుంచి ఆలనాపాలనా పెళ్లి చేసే వరకు అన్నీ తానే చూసుకుంటున్నారు అమలాపురానికి చెందిన కామాక్షి పీఠం శాశ్వత సభ్యురాలు వాణి గారు.. మదర్స్ డే సందర్భంగా కామాక్షి పీఠం (ఆశ్రమం) లో ఉన్న అనాధల బాధకు అమ్మగా మారిన ఓ మహిళను ఈరోజు ప్రపంచానికి TV9 పరిచయం చేస్తోంది.

యావత్ జగత్తులో స్వచ్ఛమైన అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. అమ్మ ఒడి భయం దరి చేరనివ్వదు. తల్లి సన్నిధిలో ఉంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. దైవత్వాన్ని మైమరిపించేది మాతృమూర్తి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అమ్మతనమే స్త్రీ జన్మకు సార్ధకతనిస్తుంది. భూదేవి కంటే మించిన ఓర్పు తల్లి హృదయానికే సొంతం. తల్లుల దినోత్సవం రోజున అటువంటి మాతృమూర్తులందరికీ శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. తల్లి ప్రేమకు దూరమయ్యి పుట్టుకతోనే అనాథలవుతున్న చిన్నారులకు అమ్మ ప్రేమంటే ఎలా తెలుస్తుంది.. వారిలో కొందరైనా ఉత్తములుగా ఎలా పెరుగుతున్నారో తెలియాలంటే అమలాపురం శ్రీకామాక్షి పీఠంలోని కామాక్షీ ప్రేమ మందిరాన్ని సందర్శించాల్సిందే. అక్కడున్న అనాథలంతా అమ్మకాని నిజమైన అమ్మ ఒడిలో పెరిగి పెద్దవారవుతున్నారు.. మాతృదినోత్సవం రోజున వక్కలంక వాణీ వంటి తల్లి కాని తల్లిని గురించి అందరూ తెలుసుకోవాలి.. ఎంతోమంది అనాధలకు కన్నతల్లి లేని లోటును తీరుస్తూ ఉన్నారు వాణి అనే మహిళ.

ఇవి కూడా చదవండి

కోనసీమ జిల్లాలోనే కాకుండా.. రాజమండ్రి , కాకినాడ ,ఏలేశ్వరం, తెలంగాణ, అనేకచోట్ల అనాథలుగా వదిలేసిన పురిటి బిడ్డలనెందరినో పీఠాధిపతి కామేశ్వర మహర్షి ప్రేమ మందిరంలో(అనాధ ఆశ్రమం)లో చేర్పించుకుంటే ఆ చిన్నారులందరికీ ఆ వాణీ తల్లిగా మారింది.. ఆమె లేకుండా అక్కడున్న అనాధలెవరూ ఒక్కరోజు గడపలేరు. చిన్నారులకైతే ప్రతినిమిషం ఆమె సన్నిదేకావాలి.. 1986 లో ప్రారంభ అయిన ఆమె ప్రయాణం… ఆ అనాధ పిల్లల భవిష్యత్ కోసమే అంటుంది ఆమె గుండె చప్పుడు…..వారి ఆటపాటలన్నీ ఆమె సన్నిధిలోనే. ఎవరికి పుట్టారో, ఎక్కడ పుట్టారో కూడా తెలియని ఆ అనాధలను అమ్మకంటే మిన్నగా ఆమె సాకుతోంది.. వారితోపాటు మరెందరో అనాథలకు ఆమె నిజమైన అమ్మ గా అవతరించింది.

ఇక్కడ కనిపిస్తున్న కామాక్షి ప్రేమ మందిరం ఎంతోమందిని చదివించి.. అనాధలకు అండగా నిలుస్తూ అనేక మంది అనాదలకు ఉద్యోగాలు, పెళ్లిళ్లు చేసుకుని సుఖ సంతోషాలతో ఉన్నారంటే ఈ ఆశ్రమం లో ఈ అమ్మే కారణం.. గత 35 ఏళ్లకు పైగా ఆమె ఎంతో మంది అనాధలకు అమ్మగా అన్నీ తానై చూసుకుంటూ మీకు నేనున్నాను భయపడకండి అని భరోసానిస్తూ.. వారిలో ధైర్యాన్ని నింపింది వాణి అనే మహిళ.

సాధారణంగా అనాధాశ్రమాలు అక్కున చేర్చుకుని అన్నం పెట్టి ఆశ్రయం ఇవ్వడం ఒక ఎత్తైతే… చదివించి ఉద్యోగాలు కల్పించి పెళ్లిళ్లు చేసి పురుడు పోసి…. వారిని మళ్లీ అదే ఆశ్రమంలో ఉండేందుకు ఆశ్రయం కల్పిస్తున్నరు.. అమలాపురం లో ఉన్న కామాక్షి ప్రేమ మందిరం గురించి మదర్స్ డే రోజు ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మ ప్రేమకు నోచుకోలేని ఎంతోమంది అనాధలు చిన్న వయసులోనే ఈ ఆశ్రమానికి వచ్చి నేడు ఉద్యోగాలు చేస్తూ మంచి హోదాలో ఉన్నారు. వీరందరికీ కన్నతల్లిలా ఆసరాగా ఉంటున్నారు ఒక్క లంక వాణి అనే మహిళ.. 35 మంది అమ్మ లేని అనాధ అమ్మాయిలు… పద్దెనిమిది మంది అబ్బాయిలు ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ఉన్నారు…

అమ్మ లేని వారికి నేనున్నాను అంటూ భరోసానిస్తూ ఎంతో మందికి… కామాక్షి ప్రేమ మందిరం బాసటగా నిలుస్తుంది మదర్స్ డే సందర్భంగా ఎంతో మంది ఆడపిల్లలు , మగ పిల్లలకు ఈ ఆశ్రమంలో ఉన్న ఒక్క లంక వాణి అమ్మ తో ఆనందంగా గడుపుతున్నారు ఈ అనాధ బాలబాలికలు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..