Mother’s Day 2022: సృష్టికి మూలం అమ్మ .. రేపే మాతృదినోత్సవం.. అసలు మదర్స్ డే ఎలా పుట్టిందంటే..
Mother's Day 2022: సృష్టికి మూలం అమ్మ..అటువంటి అమ్మని గౌరవిస్తూ.. కొన్ని దేశాలు మదర్స్ డే 2022 మేలో రెండవ ఆదివారం జరుపుకుంటాయి. ఈ ఏడాది మే 8వ 2022 న మాతృదినోత్సం వచ్చింది..
Mother’s Day 2022: సృష్టిలో కమ్మనైన పదం అమ్మ. బిడ్డను తన గర్భంలో నవమాసాలు.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బిడ్డకు జన్మనిచ్చి.. ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తన పిల్లల భవిష్యత్ కోసం, వారి ఎదుగల కోసం అమ్మ చేసే త్యాగాలు అనంతరం. ఇంట్లో నలుగురు ఉండి.. ముగ్గురికి మాత్రమే సరిపడే ఆహారం ఉంటె.. తాను తిన్నాను అంటూ.. కుటుంబ సభ్యుల కడుపునింపేదే అమ్మ. ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ.. అటువంటి అమ్మని స్మరించుకుంటూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఒక్కోరోజు మాతృదినోత్సవంను జరుపుకుంటారు. కొన్ని దేశాలు మదర్స్ డే 2022 మేలో రెండవ ఆదివారం జరుపుకుంటారు. ఈ ఏడాది మే 8వ 2022 న మాతృదినోత్సం వచ్చింది. అసలు మాతృదినోత్సవం ఎలా వచ్చింది… ఈ రోజు చరిత్ర ఏమిటి తెలుసుకుందాం..
1907 సంవత్సరంలో, అమ్మని స్మరించుకోవాలనే ఆధునిక భావన పుట్టింది. యునైటెడ్ స్టేట్స్‌లో మదర్స్ డే జరుపుకోవాలనే కోరిక మొదట రచయిత జూలియా వార్డ్ హోవే, అన్నా జార్విస్ అనే ఇద్దరు మహిళలకు పుట్టింది. అమ్మకు ఓ రోజు ఉండాలన్న ఆలోచన నుంచి పుట్టిందే మాతృదినోత్సవం వేడుక. వెస్ట్ వర్జీనియాలోని గ్రాఫ్టన్‌లోని ఆండ్రూస్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్‌లో మొదటి మదర్స్ డే దినోత్సవాన్ని అన్నా జార్విస్ జరుపుకున్నారు. ఆమె తన తల్లి నుంచి ప్రేరణ పొందింది ఈ వేడుకను నిర్వహించారు. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 1914లో దీనిని జాతీయ సెలవుదినంగా ప్రకటించారు.
మాతృదినోత్సం యునైటెడ్ స్టేట్స్‌లో సాధారణంగా గౌరవించబడే జాతీయ సెలవుదినం. ఏటా మే రెండో ఆదివారం రోజు మాతృదినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజున పిల్లలంతా తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతారు. అన్ని దేశాలు ఒకే రోజున మదర్స్ డే జరుపుకోనప్పటికీ, మే నెలలో రెండవ ఆదివారాన్ని 50కి పైగా దేశాల్లో ప్రత్యేక దినంగా జరుపుకుంటారు.
Also Read: Viral Video: కర్రతోనే అడవికి రారాజు సింహాన్ని భయపెట్టిన యువకుడు.. నెట్టింట్లో వీడియో వైరల్
Chanakya Niti: ఈ జీవితంలో కష్టాలను ఎదుర్కోవాలంటే.. ఈ 5 విషయాలను పాటించమంటున్న చాణక్య