AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore Politics: మరో వివాదంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.. కోటంరెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ మేయర్

నెల్లూరు జిల్లాలో మరో బిగ్‌ ఎపిసోడ్‌ ఇప్పుడు రచ్చగా మారింది. రంజాన్ రోజు దువాలో అబ్దుల్ అజీజ్‌ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆలింగనం చేసుకోకపోవడంపై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Nellore Politics: మరో వివాదంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే..  కోటంరెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ మేయర్
Kotamreddy Aziz
Balaraju Goud
|

Updated on: May 08, 2022 | 10:10 AM

Share

Abdul Aziz vs Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లాలో మరో బిగ్‌ ఎపిసోడ్‌ ఇప్పుడు రచ్చగా మారింది. రంజాన్ రోజు దువాలో అబ్దుల్ అజీజ్‌ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆలింగనం చేసుకోకపోవడంపై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రంజాన్ రోజు శ్రీధర్‌ రెడ్డి ఆలింగనాన్ని నిర్మోహమాటంగా తిరస్కరించారు అజీజ్. ఎందుకు తిరస్కరించారనే అంశంపై ప్రెస్‌మీట్‌ పెట్టి మరి క్లారిటీ ఇచ్చారు.

శ్రీధర్ రెడ్డి దుష్టుడు, దుర్మార్గుడు, ఆడబిడ్డల జీవితాలతో ఆడుకున్నాడని అజీజ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శ్రీధర్ రెడ్డి చరిత్ర మొత్తం త్వరలో బయటపెడతా, శ్రీధర్ రెడ్డి 8 కుటుంబాలను సర్వ నాశనం చేశాడంటూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు అజీజ్. ఇస్లాం సాంప్రదాయాల గురించి ఒకరు తనకు చెప్పాల్సిన అవసరం లేదు. తనకు అన్నీ తెలుసంటున్నారు అజీజ్.

ఇవి కూడా చదవండి

ఈ వివాదం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. శ్రీధర్ రెడ్డి ఆలింగనాన్ని నిర్మోహమాటంగా తిరస్కరించిన అజీజ్.. ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. పూర్తి చరిత్రను త్వరలో బయటపెడతానని చెప్పడం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బాధిత కుటుంబాలతోనే వివరాలు చెప్పిస్తానంటున్నారు అజీజ్.