Prakashraj vs Congress: దుమారం రేపుతున్న రాహుల్‌పై ప్రకాష్‌రాజ్ ట్వీట్.. భగ్గుమంటున్న కాంగ్రెస్ నేతలు
రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్‌పై భగ్గుమంటున్నారు కాంగ్రెస్ నేతలు.
Prakashraj vs Congress: రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్‌పై భగ్గుమంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్‌కు మద్దతుగా రాహుల్‌పై సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు ప్రకాష్‌రాజ్. అయితే రాహుల్ కాలి గోటికి కూడా ప్రకాష్‌రాజ్ సరిపోడని కామెంట్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ ట్వీట్ రాజకీ వివాదాన్ని రేపుతోంది.
రాహుల్‌గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన ముగిసింది. అయితే వరంగల్ సభలో రాహుల్‌గాంధీ చేసిన డిక్లరేషన్, కామెంట్లపై ఇప్పటికే టిఆర్‌ఎస్ నేతలతో పాటు అటు బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. తాజాగా నటుడు ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్ కూడా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తెలంగాణను దార్శనికుడైన కేసీఆర్ పరిపాలిస్తున్నారని, మీ మూర్ఖుల గుంపుతో ఏమి ఆఫర్ చేస్తారో చెప్పాలని ట్వీట్ చేశారు ప్రకాష్‌రాజ్. ఇదే ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రకాష్‌రాజ్ ట్వీట్‌పై టి కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
ప్రకాష్‌రాజ్‌కు సినిమాలు లేవని, గ్లామర్ అవుటైపోయిందని కామెంట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రాజ్యసభ సీటు కోసం పాకులాడుతున్నాడని ఆరోపించారు. ఒక్కరోజు కూడా ప్రకాష్‌రాజ్ ప్రజల్లోకి రాలేదని, అసలు కేసీఆర్ గురించి ప్రకాష్‌రాజ్‌కు ఏం తెలుసని మండిపడ్డారు జగ్గారెడ్డి. అంతేకాదు ఇదే ప్రకాష్‌రాజ్, కేసీఆర్‌ను తిట్టే రోజు కూడా వస్తుందని జోస్యం చెప్పారు. రాహుల్‌గాంధీ కాలి గోటికి కూడా ప్రకాష్‌రాజ్ సరిపోడని తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు జగ్గారెడ్డి.
ఇటు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రకాష్‌రాజ్ ట్వీట్‌పై మండిపడ్డారు. ఆయనో బఫూన్ అని కామెంట్ చేశారు. అంత మొనగాడు అయితే మా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నించారు ఉత్తమ్. కేసీఆర్ మెప్పు కోసం ప్రకాష్‌రాజ్ ఆరాటపడుతున్నాడని, రాజ్యసభ సీటు ఇస్తారనే ఆశతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఉత్తమ్ మండిపడ్డారు.
ఇటీవల టిఆర్‌ఎస్ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు ప్రకాష్‌రాజ్. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌థాకరేను కలిసేందుకు వెళ్లిన సమయంలో కూడా కేసీఆర్‌తో ఉన్నారు ప్రకాష్‌రాజ్. తాజాగా రాహుల్‌గాంధీపై సెటైర్ వేయడంతో పరోక్షంగా ప్రకాష్‌రాజ్ టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిగానే మిగతా పార్టీ నేతలు భావిస్తున్నారు. తాజాగా చేసిన ట్వీట్‌తో కాంగ్రెస్ నేతలు ప్రకాష్‌రాజ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.