Summer Holidays: విద్యా సంవత్సరంలో మార్పులు చేసిన జేఎన్‌టీయూ.. విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్‌..

Summer Holidays: కరోనా (Corona) మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు తరగతుల నిర్వహణలో జాప్యం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన...

Summer Holidays: విద్యా సంవత్సరంలో మార్పులు చేసిన జేఎన్‌టీయూ.. విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్‌..
Follow us

|

Updated on: May 08, 2022 | 6:50 AM

Summer Holidays: కరోనా (Corona) మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు తరగతుల నిర్వహణలో జాప్యం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో విద్యా సంవత్సరం సజావుగా సాగుతోంది. పరీక్షలను సైతం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జేఎన్‌టీయూ హైదరాబాద్‌ కూడా విద్యా సంవత్సరంలో మార్పులు చేసింది. నిజానికి కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభంకావడంతో ఈ ఏడాది వేసవి సెలవులు లేకుండానే అకడమిక్‌ క్యాలెండర్‌ను అధికారులు ప్రారంభించారు. అయితే తాజాగా వేసవి సెలవులను ప్రకటించారు.

తెలంగాణ వ్యాప్తంగా జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ విద్యార్థులకు రెండు వారాల పాటు వేసవి సెలవులు ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మే 15 నుంచి 29 వరకు సెలవులు ఇస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ ఆదేశాలు జారీ చేశారు. తిరిగి 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక పరీక్షల నిర్వహణలోనూ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు మే 30 నుంచి ప్రారంభమై, జూన్‌ 11న ముగుస్తాయి. ఇక రెండో సెమిస్టర్‌ తరగతులు జూన్‌ 13 నుంచి ప్రారంభమవుతుండగా, ఆగస్టు 24 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. సెకండ్‌ ఇయర్‌, సెకండ్‌ సెమిస్టర్‌ తరగతులు ఆగస్టు 17 నుంచి, మూడో ఏడాది రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 26 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Pawan Kalyan: పవర్‌స్టార్‌ను కలిసిన స్టార్‌ కమెడియన్‌.. తన సంతోషాన్ని ఎలా షేర్‌ చేసుకున్నాడో తెలుసా?

Viral News: ఆమె కాలి గోర్లకు భారీ డిమాండ్.. లక్షల్లో సంపాదిస్తున్న మోడల్..

IPL 2022: గాల్లో ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టిన బట్లర్.. షాక్‌ అయిన గబ్బర్..!