SBI Jobs: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లకు ఉద్యోగ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..

దేశంలోని అతిపెద్ద పబ్లిక్ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) కేటగిరీ కింద 35 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది.

SBI Jobs: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లకు ఉద్యోగ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 08, 2022 | 12:16 AM

దేశంలోని అతిపెద్ద పబ్లిక్ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) కేటగిరీ కింద 35 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. SBI విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ మే 17గా ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ – sbi.co.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు రూ.750 దరఖాస్తు రుసుము విధించారు. SC/ST/PWD వర్గాలకు చెందిన అభ్యర్థులకు, రుసుము మినహాయించారు. SCO రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, SBI ‘సీనియర్ ఎగ్జిక్యూటివ్’ పోస్టులకు నలుగురు, ‘సిస్టమ్ ఆఫీసర్’ కోసం ఏడుగురు, ‘ఎగ్జిక్యూటివ్’ కోసం 17 మందిని నియమిస్తోంది.అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ ఆధారంగా ఆన్‌లైన్ పరీక్ష జూన్ 25, 2022న నిర్వహిస్తారు. కాల్ లెటర్‌ను జూన్ 16 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అర్హత ప్రమాణాలలో సంబంధిత విద్యార్హతలు కాకుండా కొన్ని పోస్టులకు కనీసం రెండేళ్ల పని అనుభవం, కొన్ని ఖాళీ స్థానాలకు ఎనిమిదేళ్లు అనుభం ఉండాలి. ప్రతి పోస్ట్‌కు సంబంధించిన వివరాలను SBI ఉద్యోగ నోటిఫికేషన్‌లో తనిఖీ చేయవచ్చు. చాలా ఖాళీల కోసం, అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్షలో పొందిన మార్కులపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్వ్యూపై కూడా ఆధారపడి ఉంటుంది. “ఎంపిక కోసం మెరిట్ జాబితా కేవలం ఇంటర్వ్యూలో పొందిన స్కోర్‌ల ఆధారంగా అవరోహణ క్రమంలో తయారు చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులను సాధించినట్లయితే వయస్సును బట్టి ఎంపిక చేస్తారు.

Read Also.. Nitin Gadkari: దేశంలో భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. వచ్చే రెండేళ్లలో ఎన్నంటే..?