Viral News: ఆమె కాలి గోర్లకు భారీ డిమాండ్.. లక్షల్లో సంపాదిస్తున్న మోడల్..

ఇంగ్లండ్.. మాంచెస్టర్‌కి చెందిన ఈ 28 ఏళ్ల బ్యూటీ... తనకు ఓ వ్యక్తి మెసేజ్ ద్వారా ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలిపింది.

Viral News: ఆమె కాలి గోర్లకు భారీ డిమాండ్.. లక్షల్లో సంపాదిస్తున్న మోడల్..
Model
Follow us
Rajitha Chanti

|

Updated on: May 07, 2022 | 7:01 PM

ప్రపంచంలో చాలా మందికి అనేక రకాల కోరికలు ఉంటాయి. మన దేశంలోనే కాకుండా.. ఇతర దేశాల్లో ఉండే కొందరు వ్యక్తులు చేసే పనులు చూస్తూంటే విచిత్రంగా అనిపిస్తుంటాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు.. మోడల్స్‏కు విచిత్ర అనుభవాలు ఎదురవుతాయి. తాజాగా అంతర్జాతీయ మోడల్ అలెక్సిస్ హీలీ ఓ వింత ఆఫర్ అందుకుంది. కాలి గోర్ల ఫొటోలు పంపితే లక్షలకు లక్షలు ఇస్తాం అన్నది ఆఫర్‌ సారాంశం. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ ఏముంటుంది అనుకున్న ఆమె… గబగబా హై క్వాలిటీ కెమెరా వాడే ఫొటోగ్రాఫర్‌తో చక్కటి కాలి గోర్ల ఫొటోలు తీయించుకొని అమ్ముకుంది. ఒకప్పుడు వెయిట్రెస్‌గా పనిచేసిన అలెక్సిస్ ఓ అడల్ట్ సైట్‌ సభ్యురాలు కూడా. అంతేకాదు ఆమెలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆమె ఓ ట్రాన్స్‌జెండర్. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది.

డైలీస్టార్ పత్రిక రిపోర్ట్ ప్రకారం… ఇంగ్లండ్.. మాంచెస్టర్‌కి చెందిన ఈ 28 ఏళ్ల బ్యూటీ… తనకు ఓ వ్యక్తి మెసేజ్ ద్వారా ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలిపింది. మొదట జోక్ చేశాడు అనుకుంది. తర్వాత సీరియస్ గానే అడిగాడని తెలుసుకుంది. రకరకాల యాంగిల్స్‌లో పాదాలు, వేళ్లు, గోర్ల ఫొటోలను అతనికి పంపింది. వెంటనే అతను ఆమెకు 9.5 లక్షల రూపాయలు పంపాడు. ఇంతకీ అతను ఆ గోర్లను ఏం చేసుకుంటాడో తనకు తెలియదంటోంది అలెక్సిస్. ఓ మంచి పని కోసం వాటిని వాడతాడని ఆశిస్తున్నట్లు తెలిపింది. అలిక్స్ ఒక చిన్న నగల పెట్టెలో గోళ్లను ఉంచి అనేక వస్తువులతో అలంకరించాడని తెలిపింది.

Also Read: Sarkaru Vaari Paata Pre Release Live: అంగరంగా వైభవంగా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్.. సందడి చేస్తోన్న మహేష్ ఫ్యాన్స్..

Mahesh Babu: ఫ్యాన్స్‏కు మహేష్ బాబు స్పెషల్ లెటర్.. ఒకేసారి డబుల్ ట్రీట్ ..

Kajal Aggarwal: మళ్లీ నాజుగ్గా మారిన చందమామ.. డెలివరీ తర్వాత తొలి ఫోటో షేర్ చేసిన కాజల్..

Anchor Suma: సుమకు తప్పిన పెను ప్రమాదం.. కాలు జారి పడిన యాంకరమ్మ..