AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవర్‌స్టార్‌ను కలిసిన స్టార్‌ కమెడియన్‌.. తన సంతోషాన్ని ఎలా షేర్‌ చేసుకున్నాడో తెలుసా?

నితిన్‌, బండ్ల గణేశ్ లాంటి హీరోలు, ఆర్టిస్ట్‌లు సైతం పవన్‌ను ఎంతగానో అభిమానిస్తుంటారు. వారే కాదు టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, కమెడియన్లు పవన్‌ను కలుసుకుని ఆయనతో ఆటోగ్రాఫ్‌, ఫొటోగ్రాఫ్‌లు తీసుకుంటుంటారు.

Pawan Kalyan: పవర్‌స్టార్‌ను కలిసిన స్టార్‌ కమెడియన్‌.. తన సంతోషాన్ని ఎలా షేర్‌ చేసుకున్నాడో తెలుసా?
Pawan Kalyan
Basha Shek
|

Updated on: May 07, 2022 | 9:43 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు ఉన్న క్రేజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటోన్న ఆయనకు అశేష అభిమాన గణం ఉంది. నితిన్‌, బండ్ల గణేశ్ లాంటి హీరోలు, ఆర్టిస్ట్‌లు సైతం పవన్‌ను ఎంతగానో అభిమానిస్తుంటారు. వారే కాదు టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, కమెడియన్లు పవన్‌ను కలుసుకుని ఆయనతో ఆటోగ్రాఫ్‌, ఫొటోగ్రాఫ్‌లు తీసుకుంటుంటారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోతుంటారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగితేలుతున్నాడు ప్రియదర్శి (Priyadarshi). టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌ గుర్తింపు తెచ్చుకున్న అతను తాజాగా పవర్‌ స్టార్‌ను కలుసుకున్నారు. ఆయనతో కలిసి సరదాగా ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం వాటిని ఫ్యాన్స్‌తో పంచుకుని మురిసిపోయాడు.

నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి..

ఇవి కూడా చదవండి

‘‘ఎప్పటిలాగా సారథి స్టూడియోలో షూటింగ్‌కి వెళ్లాను. అయితే ఆ రోజు మాత్రం ఎప్పటి లాగా లేదు. ఎటు చూసినా హడావిడి, అందరి కళ్లలో ఏదో సందడి. అందరి నోట ఒకే మాట పవన్‌ కల్యాణ్‌గారు వస్తున్నారు. అంతే! వారితో ఒక మాటైనా మాట్లాడాలి, వారు తీసిన చిత్రం జానీ సినిమా ఎంతగా నచ్చిందో చెప్పడానికి రోజంతా ఎదురుచూశాను! దర్శకుడు హరీష్‌ శంకర్‌ అన్న వల్ల ఆ కోరిక తీరింది. నీకు ప్రత్యేక కృతజ్ఞతలు హరీశ్‌ అన్న! కల్యాణ్‌ గారిని కలిసి మాట్లాడడం ఒక మర్చిపోలేని అనుభూతి’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు ప్రియదర్శి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. పవర్‌స్టార్‌ అభిమానులు ఈ ఫొటోలను చూసి ఖుషీ అవుతున్నారు.

కాగా ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో కూడా నటించనున్నాడు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు సారథి స్టూడియోలో జరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే పవర్‌స్టార్‌ను కలిశాడు ప్రియదర్శి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

PBKS vs RR, IPL 2022: తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగిన జైస్వాల్‌.. పంజాబ్‌ ప్లే ఆఫ్‌ ఆశలకు చెక్‌!

Things Banned For Afghan Women: నెయిల్ పాలిష్ నుంచి హైహీల్స్ వరకు.. అఫ్గాన్‌ మహిళలపై ఉన్న ఆంక్షలివే..

IPL 2022: మైదానంలోనే కాదు డ్యాన్స్‌లోనూ ఇరగదీస్తోన్న చాహల్‌, బట్లర్‌.. పంజాబీ పాటకు ఎలా స్టెప్పులేశారో చూడండి..