Heat Waves: భానుడి భగభగలు.. ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు.. ఆందోళనలో జనాలు..
భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సెగలుకక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం పెరుగుతున్న ఎండ తీవ్రత ధాటికి ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. భనుడి భగభగలకు

భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సెగలుకక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం పెరుగుతున్న ఎండ తీవ్రత ధాటికి ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. భనుడి భగభగలకు రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాల టైర్లు పెళ్లిపోతున్నాయి. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌లతో సెల్ ఫోన్ టవర్లు కాలిపోతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లాలో ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయి.
పోలవరం మండలం కొత్త పట్టి సీమలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వందల ఎకరాల్లో వరి కుప్పలు దగ్ధమయ్యాయి. భారీ ఎండల ధాటికి మంటలు రాజుకున్నాయి. వంద ఎకారాల్లో ఉన్న వరి కుప్పలకు మంటలు అంటుకున్నాయి. తొలుత ఒక వరికుప్పకు అంటుకున్న నిప్పు.. క్షణాల్లో మిగిలిన వరి కుప్పలకు అంటుకుంది. చూస్తుండగానే క్షణాల్లో వరి కుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆదుపు చేశారు. వరి కుప్పలు కాలిపోవడంతో తమకు తీవ్ర నష్టం జరిగిందిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటూ గుంటూరు జిల్లా ఆటో నగర్‌లోనూ అగ్ని ప్రమాదం జరిగింది. మిర్చి లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటల్లో మిర్చి బస్తాలు దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మిర్చి బస్తాలను బయటకు రాలేశారు. దీంతో మంట తీవ్రత తగ్గింది.




సహజంగా వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ప్రధానంగా గ్రామాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. వ్యవసాయ పనులు ముగియడంతో ఆయా పంటచేనులో ఎండిన గడ్డి, ఇతర పంట వ్యర్థాలను కాల్చి వేస్తుంటారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే గాలికి నిప్పురవ్వలు ఎగిరి సమీపంలో ఉన్న గడ్డివామి లేదా ఇంటి పరిసరాల్లో పడితే మంటలు దావనంలా వ్యాప్తి చెందుతాయి.
ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా విద్యుత్ సంబంధిత అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ప్రధానంగా ఎండ తీవ్రతను తట్టుకునేందుకు షాపింగ్‌మాల్స్, ఆసుపత్రులు, ఇతర వ్యాపార సముదాయాలతోపాటు నివాసాల్లో ఏసీలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో షాట్ సర్యూట్ జరిగి మంటలు వ్యాపిస్తుంటాయి. ఇలా అగ్ని ప్రమాదం ఏరూపంలో ఉన్నప్పటికీ ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టమూ వాటిల్లుతుంది. అందుకే వేసవికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత్తైన ఉంది.
మరిన్ని వాతావరణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
