Srisailam Politics: శ్రీశైలంలో రాజకీయ సెగలు.. హద్దులు దాటే మాటలతో కవ్వింపులు..
సీమలో ఎండలే కాదు.. రాజకీయం కూడా అట్టుడుకుతోంది. వైసీపీ, టీడీపీ వాడీవేడీ విమర్శలతో మరింత సెగలు కక్కుతున్నాయి పాలిటిక్స్. యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర తర్వాత సవాళ్లు, హద్దులు దాటే మాటలతో కవ్విస్తున్నారు నాయకులు.
![Srisailam Politics: శ్రీశైలంలో రాజకీయ సెగలు.. హద్దులు దాటే మాటలతో కవ్వింపులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/srisailam-politics.jpg?w=1280)
సీమలో ఎండలే కాదు.. రాజకీయం కూడా అట్టుడుకుతోంది. వైసీపీ, టీడీపీ వాడీవేడీ విమర్శలతో మరింత సెగలు కక్కుతున్నాయి పాలిటిక్స్. యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర తర్వాత సవాళ్లు, హద్దులు దాటే మాటలతో కవ్విస్తున్నారు నాయకులు. వ్యక్తిగత అంశాలతో రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు.. ఈ విమర్శల తర్వాత శ్రీశైలంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయింది రాజకీయం. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మధ్య వ్యక్తిగత అంశాలు చర్చగా మారిపోయాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు ప్రధాన పార్టీలు హద్దు మీరి విమర్శలు చేసుకోవడంతో స్థానికంగా ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.
శ్రీశైలంలో రాజకీయం.. లోకేష్ పాదయాత్ర తర్వాత మారింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మధ్య వార్ నేపథ్యంలో.. యువగళం పాదయాత్రలో లోకేష్ పలు విమర్శలు చేశారు. చీటింగ్ చక్రపాణిరెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత బుడ్డా రాజశేఖర్ కౌంటర్ ఇవ్వడంతో.. ఆరేళ్లు చీటింగ్ టీడీపీలోనే కొనసాగానని శిల్పా కౌంటర్ ఇచ్చారు. టికెట్ రాదనే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి విమర్శలు చేశారంటూ శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. చిల్లర మాటలు మానుకోవాలని లేకపోతే.. రాజకీయం మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/relationship-tips5-5.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/relationship-tips-1.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/relationship-tips3-1.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/relation.jpg)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..