Andhra Pradesh: ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప.. లంచం తీసుకుంటున్న అడ్డంగా దొరికిన సబ్ రిజిస్ట్రార్
Andhra Pradesh: పక్కా ప్లాన్ తో అనంతపురంలోని సబ్ రిజిస్టర్ నారాయణస్వామి ఇంటి సమీపంలో రియాల్టర్ నాగేంద్ర నాయక్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ నారాయణస్వామి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు..

Andhra Pradesh: సాధారణంగా ఏదైనా పొలం, స్థలం, ఇల్లు కొంటె… వాటి వాల్యుయేషన్ ప్రకారం.. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు స్టాంపు డ్యూటీ కడతారు. అలా ఓ రియల్టర్ ఒకటిన్నర ఎకరా పొలాన్ని రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే.. ఆ భూమి మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి కమర్షియల్ ల్యాండ్ అని.. అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని సబ్ రిజిస్టర్ చెప్పాడు.
అలా కమర్షియల్ ల్యాండ్ ను అగ్రికల్చర్ ల్యాండ్ గా రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్టార్ నారాయణస్వామి అవినీతి బాగోతం అంతా ఇంతా కాదు.. నాగేంద్ర నాయక్ అనే ఓ రియల్టర్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఒకటిన్నర ఎకరా పొలం కొనుగోలు చేశాడు. ఆ పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు. కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ నారాయణస్వామి అది కమర్షియల్ ల్యాండ్ అని, అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచం కావాలని డిమాండ్ చేశాడు. ఐదు లక్షల రూపాయల లంచం సబ్ రిజిస్టార్ నారాయణస్వామి రియల్టర్ నాగేంద్ర నాయక్ ను అడిగాడు.
ఇది కూడా చదవండి: Electric Scooter: కేవలం రూ.54వేలకే 130కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!
అనంతపురంలోని తన ఇంటి సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నాయక్ నుంచి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థలాన్ని కమర్షియల్ ల్యాండ్ అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంప్ డ్యూటీ తగ్గుతుందని, సబ్ రిజిస్టర్ నారాయణస్వామి నాగేంద్ర నాయక్ కొనుగోలు చేసిన స్థలాన్ని ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ కింద అనంతపురం పట్టణంలోని రాంనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కు సబ్ రిజిస్టర్ నారాయణస్వామి అనుమతి ఇచ్చాడు. దీంతో ఈనెల 17వ తేదీన నాగేంద్ర నాయక్ రామ్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థలాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం.. 5 లక్షలు లంచం డబ్బులు ఇవ్వాలని సబ్ రిజిస్టర్ నారాయణస్వామి డిమాండ్ చేయడంతో. రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నాయక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఇది కూడా చదవండి: Honda Activa 6G: హోండా యాక్టివా 6G.. 316 కి.మీ మైలేజ్.. రూ.5 వేలు చెల్లిస్తే చాలు స్కూటీ మీ సొంతం!
దీంతో పక్కా ప్లాన్ తో అనంతపురంలోని సబ్ రిజిస్టర్ నారాయణస్వామి ఇంటి సమీపంలో రియాల్టర్ నాగేంద్ర నాయక్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ నారాయణస్వామి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సబ్ రిజిస్టర్ నారాయణస్వామిని కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పలు కీలకమైన డాక్యుమెంట్లు తనిఖీ చేసి కార్యాలయ సిబ్బందిని కూడా ఏసీబీ అధికారులు విచారించారు. ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కళ్యాణదుర్గం రిజిస్టర్ నారాయణస్వామిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు సబ్ రిజిస్టర్ నారాయణస్వామి.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్!
ఇది కూడా చదవండి: Best Scheme: నెలకు రూ.210 డిపాజిట్ చేస్తే రూ.5000 పెన్షన్.. ఇదంటే అసలైన స్కీమ్!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




