AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: పైడితల్లి సిరిమాను పండుగలో అపశృతి.. బొత్స ఫిర్యాదుతో స్పందించిన ప్రభుత్వం..

Vizianagaram: పైడితల్లి జాతర జిల్లాలో అత్యంత పవిత్రమైన, పెద్ద పండుగ. అలాంటి వేడుకలో ఈ తరహా ప్రమాదం జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. విచారణ నివేదిక రాగానే కాంట్రాక్టర్‌ పై, సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో..

Vizianagaram: పైడితల్లి సిరిమాను పండుగలో అపశృతి.. బొత్స ఫిర్యాదుతో స్పందించిన ప్రభుత్వం..
Gamidi Koteswara Rao
| Edited By: Krishna S|

Updated on: Nov 30, 2025 | 10:05 PM

Share

విజయనగరం జిల్లాలో జరిగిన పైడితల్లి సిరిమాను పండుగ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు కూర్చొన్న వేదిక కూలిపోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పైడితల్లి సిరిమాను ఉత్సవం విజయనగరం జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో ప్రతి ఏటా డిసిసిబి బ్యాంక్ ఆవరణలో బొత్స కూర్చోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సారి డిసిసిబి బ్యాంక్ చైర్మన్ కిమిడి నాగార్జున డీసీసీబీ ప్రాంగణంలో కూర్చోవడం శాసన మండలి చైర్మన్ బొత్స కోసం ప్రత్యేకంగా మూడు లాంతర్ల సమీపంలో మరో వేదిక ఏర్పాటు చేశారు.

అలా ఆ వేదికపై బొత్స సత్యనారాయణ కుటుంబసభ్యులతో పాటు ఎమ్మెల్సీ డా. సురేష్ బాబు. మాజీ ఎంపీ పెదబాబు కూర్చున్నారు. అయితే ఆ వేదిక వేదిక ఒక వైపు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ క్షణంలో వేడుక ప్రాంగణం మొత్తం గందరగోళం మారిపోయింది. అదృష్టవశాత్తు బొత్సకు ఎలాంటి గాయాలు కాకపోవడం పెద్ద అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ సురేష్ బాబు, స్థానిక పోలీసు అధికారిగా ఉన్న ఎస్‌ఐ అశోక్ కుమార్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై అనేక అనుమానాలు తలెత్తాయి. వేదిక నిర్మాణం నాణ్యత పై సందేహాలు వ్యక్తమయ్యాయి. వేదిక పై భారం ఎక్కువైందా? లేక నిర్మాణంలో నిర్లక్ష్యం జరిగిందా? అన్న కోణంలో సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనపై బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

వెంటనే ఆయన ఫిర్యాదు మేరకు జరిగిన సంఘటన పై విచారణ జరిపి నివేదిక పంపించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ కు ఆదేశించింది. దీంతో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి వెంటనే విచారణ ప్రారంభించారు. త్వరితగతిన అందుకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి పంపనున్నారు. నివేదిక ప్రభుత్వానికి అందిన తరువాత వేదిక నిర్మాణ బాధ్యతల్లో ఉన్న వారిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

పైడితల్లి జాతర జిల్లాలో అత్యంత పవిత్రమైన, పెద్ద పండుగ. అలాంటి వేడుకలో ఈ తరహా ప్రమాదం జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. విచారణ నివేదిక రాగానే కాంట్రాక్టర్‌ పై, సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో పెద్ద నష్టం జరగకపోవడం అదృష్టమనే చెప్పాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఇప్పటికే పలు సూచనలు ఇచ్చింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి