శ్రీకాళహస్తి కళంకారీకి ప్రత్యేక గుర్తింపు.. కళాకారుడికి అరుదైన అవకాశం..!

కలలకు కాణాచిగా పేరొందిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కళాకారుడికి అరుదైన గౌరవం దక్కింది. కలంకారి కళాకారుడు, శిల్పగురు అవార్డు గ్రహీత గురు శ్రీనివాస్ కు అరుదైన అవకాశం దక్కింది.

శ్రీకాళహస్తి కళంకారీకి ప్రత్యేక గుర్తింపు.. కళాకారుడికి అరుదైన అవకాశం..!
Kalankari Artist Srinvas
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 24, 2024 | 4:16 PM

కలలకు కాణాచిగా పేరొందిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కళాకారుడికి అరుదైన గౌరవం దక్కింది. కలంకారి కళాకారుడు, శిల్పగురు అవార్డు గ్రహీత గురు శ్రీనివాస్ కు అరుదైన అవకాశం దక్కింది. ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్యారిస్‌లో జరిగే పారా ఒలంపిక్స్ ముగింపు వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది.

ఈ మేరకు శ్రీకాళహస్తికి చెందిన వేళాయుధం శ్రీనివాసులు భారత ప్రభుత్వం తరఫున కలంకారి ప్రదర్శనలో పాల్గొననున్నారు. ఒలంపిక్స్ వేడుకలు ముగింపు కార్యక్రమంలో ప్రఖ్యాత కలంకారీ కలను ప్రదర్శించే అవకాశం పొందారు. సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు జరగనున్న పారా ఒలంపిక్స్ ముగింపు వేడుకలు జరగనుండగా దేశంలోని 5 రాష్ట్రాల నుంచి 5 విభిన్న కళల్లో ప్రతిభావంతులైన ఐదు మంది కళాకారులకు మాత్రమే ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం దక్కింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి శ్రీకాళహస్తి వాసి అయిన శిల్ప గురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులును కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తమవుతోంది. పారిస్ ఒలంపిక్స్ వేడుకల్లో ప్రఖ్యాత కలంకారీ కలను ప్రదర్శించే అరుదైన గౌరవం తనకు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేఇస్తున్నారు కలంకారీ కళాకారుడు శ్రీనివాసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వేలాయుధం శ్రీనివాసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..