అమరావతి రీలాంచ్‌కు కౌంట్ డౌన్.. ఎస్పీజీ ఆధీనంలోకి సభా ప్రాంగణం.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో..
ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అమరావతిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మోదీ టూర్ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు.. ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.

ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అమరావతిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మోదీ టూర్ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు.. ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. అటు.. అమరావతిలోని సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా హెలీపాడ్ నుంచి వేదిక వరకు కారులో నుంచే అభివాదం చేస్తూ గ్రౌండ్ దగ్గరకు చేరుకోనున్నారు.
ఇప్పటికే.. ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రుల కమిటీ పర్యవేక్షిస్తోంది. దానిలో భాగంగా.. సభా వేదిక దగ్గర కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రుల కమిటీ సమావేశమైంది. మోదీ సభ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ చర్చించారు. మోదీ సభ పర్యవేక్షణ అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎండాకాలం దృష్ట్యా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని.. మంచినీరు.. మజ్జిగ ఉండేటట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమ వేదికపై మొత్తం 14 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీతో పాటు.. గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు ఆశీనులు అయ్యేలా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు మూడు వేర్వేరు ప్రాంగణాలు ఏర్పాటు చేసినా.. వేదిక మాత్రం ఒక్కటే ఉండనుంది. వేదిక ఎదురుగా అమరావతి రైతులకు ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు.
ఇక.. అమరావతి పర్యటనలో రేపు 49వేల 40 కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు భూమి చేస్తారు. అలాగే.. పలు జాతీయ సంస్థలకు చెందిన 57వేల 962 ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..