AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లమల అడవుల్లో కలకలం.. అటవీ డివిజన్ లో పెద్దపులి అనుమానాస్పద మృతి..!

ఆత్మకూరు అటవీ డివిజన్ లో పెద్దపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నల్లమల అడవుల్లోకి పెద్దపులిలో వేటగాళ్లు చొరబడ్డారా? పులులు చిరుతలకు ప్రమాదం పొంచి ఉందా? నల్లమల అడవుల్లో పెద్దపులి మృతి చెందడానికి కారణం ఏంటి? అటవీశాఖ అధికారులు ధ్రువీకరించడంలో 20 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? పెద్దపులి మృతికి కారణాలు ఏంటి?

నల్లమల అడవుల్లో కలకలం.. అటవీ డివిజన్ లో పెద్దపులి అనుమానాస్పద మృతి..!
Nallamalas Tiger Death
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: May 01, 2025 | 2:30 PM

Share

నల్లమల అడవుల్లోకి పెద్దపులిలో వేటగాళ్లు చొరబడ్డారా? పులులు చిరుతలకు ప్రమాదం పొంచి ఉందా? నల్లమల అడవుల్లో పెద్దపులి మృతి చెందడానికి కారణం ఏంటి? అటవీశాఖ అధికారులు ధ్రువీకరించడంలో 20 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? పెద్దపులి మృతికి కారణాలు ఏంటి?ఆత్మకూరు అటవీ డివిజన్ లో పెద్దపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

కొత్తపల్లి మండలం, గుమ్మడాపురం బీట్ లోని గంగిరేవు చెరువు సమీపంలో పెద్దపులి కళేబరాన్ని ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు.వెంటనే సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ ఉన్నతాధికారులు పులి మృతి విచారణ చేస్తున్నారు. అయితే పులి మృతి చెంది సుమారు ఇరవై రోజులు అయివుండొచ్చని ఫారెస్ట్ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

పులి శరీరం మొత్తం ఎండిపోయి ఎముకల గూడు లాగా కనపడుతున్నాడంతో, అనారోగ్యం కారణంగా చనిపోయిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు ఆత్మకూరు రేంజర్ పట్టాభి తెలియజేశారు. ఈ పెద్ద పులి ఏ విధంగా మృతి చెందింది అనారోగ్యం కారణంగా లేక వేటగాళ్ల ఉచ్చుకు బలైందా అనే కొనంలో అటవీశాఖ అదికారులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపులి మృతి చెందిన 20 రోజుల తర్వాత అధికారులు అధికారికంగా ధ్రువీకరించడం చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..