Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిని వర్ణిస్తూ అద్భుతచిత్రం!
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కలిచివేసింది. ఉగ్రదాడిలో 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరణించిన మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కొందరు సైకత శిల్పాలను ఏర్పాటు చేసి మృతుల కుటుంబాలకు నివాళులర్పిస్తున్నారు. ఈ తరుణంలో ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ ఓ చిత్రకారుడు తన అద్బుతమైన చిత్ర కళతో తన ఆవేదనను చిత్రం రూపంలో గీసి చూపించాడు.

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ అనేక సామాజిక, పౌరాణిక, సాంస్కృతిక, దేశభక్తులు, వీర మరణం పొందిన జవాన్లు, చిత్రాలను ఆలోచింపజేసే రీతిలో వేస్తూ ఉంటాడు. ఇలా వందల చిత్రాలు గీసి ఎందరో మన్నలతోవపాటు అనేక అవార్డులు పొందారు. ఇప్పుడు తాజాగా భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని వ్యతిరేకిస్తూ ఈ అద్బుతమైన చిత్రం గీశారు. జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది భారతీయులు చనిపోవడంపై చలించిపోయిన ఆయన… తన అవేదనను చిత్రం రూపంలో తెలియజేశాడు. ఈ చిత్రంలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన 26 మంది పర్యాటకులు, ఉగ్రదాడిలో చనిపోయిన నిర్జీవంగా పడిపోయిన భారతీయిలను చూస్తూ కన్నీరు పెట్టిన భరత మాతను మనం చూడవచ్చు, అంతే కాకుండా ఈ మారణకాండ చూస్తూ ఓ పాకిస్తాని ఉగ్రదాది వెకిలి నవ్వు నవ్వుతూ ఉండే డ్రాయింగ్‌ను కోటేశ్వర్‌రావు ఎంతో అద్భుతంగా వేశాడు. ఈ డ్రాయింగ్‌తో తన మనసులో ఉన్న ఆవేదనను ఆయన తెలియజేశారు.
ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ ఉగ్రవాది దాడిలో చనిపోయిన భారతీయులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు .ఇప్పటికైన భారత్ ఉగ్రవాదుల పై కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఎంతో అహ్లాదకరమైన వాతావరణంలో అనందంగా గడుపుతున్న కుటుంబాలపై అతి దగ్గరగా వచ్చి కాల్పు జరపి చంపడం దారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈచిత్రాన్ని మృతుల కుటుంబీకులకు అంకితం చేస్తున్నట్లు చిత్రకారుడు కోటేష్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..