Speaker Tammineni: బీజేపీ ప్రజాగ్రహ సభపై స్పీకర్ తమ్మినేని సీతారాం విసుర్లు .. ఆ కీలక అంశంపై మాట్లాడాలని డిమాండ్..
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహా సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గూరించి చెప్పాలని డిమాండ్ చేశారు....
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహా సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గూరించి చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో యోధులు అమరులైయ్యారని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా పనిచేసిన తన గుండె రగిలిపోతుందని అన్నారు. మహానీయుల త్యాగాలు ప్రైవేట్ పరం చేయడానికా ఈ సభ అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.
ఏపీ నాయకులంతా మోడీ, నిర్మలా సీతారామన్‌తో స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడాలని కోరారు. రాజకీయపార్టీలకు ఎజెండా ప్రాధాన్యతలు ఉంటాయని.. సభలు పెట్టుకోవడంలో తప్పులేదన్నారు. కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యమనేతగా తను మాట్లాడాల్సి వస్తుందన్నారు. ప్రజాగ్రహా సభలో రైల్వే జోన్, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీపై మాట్లాడాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు.
సభాపతిగా మాట్లాడుతున్నానని బీజేపీ నాయకులు అనుకోవడానికి ఏం లేదన్న తమ్మినేని.. ప్రత్యక్షంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడిగా.. గుండె మంటతో మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, ప్రత్యేక హోదా కోసం భాజపా నాయకులు చెబితే సంతోషిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రజలే తేల్చుతారన్నారు.
Read Also.. Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..