Southwest monsoon: తొలికరి పలకరింపు.. తెలుగు రాష్ట్రాల్లో కమ్మేసిన మబ్బులు.. అలుముకున్న చీకట్లు
AP,TS Rain Fall: తొలకరి కబురొచ్చింది.. నైరుతి రుతుపవనాలు మరికాసేపట్లో రాయలసీమను పలకరించనున్నాయి. తర్వాత క్రమంగా రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి.
తొలకరి కబురొచ్చింది.. నైరుతి రుతుపవనాలు మరికాసేపట్లో రాయలసీమను పలకరించనున్నాయి. తర్వాత క్రమంగా రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. గురవారం రోజు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలతోపాటు లక్షద్వీప్, దక్షిణ కేరళ, దక్షిణ తమిళనాడు, కొమరిన్-మాల్దీవులు, బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాల ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 30 గంటల్లో మరింత విస్త్రారంగా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
కోస్తా, రాయలసీమలతోపాటు తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో ఇప్పటికే అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను నల్లటి మబ్బులు కమ్మేశాయి.
ఇదిలావుంటే నైరుతి అలా కేరళను తాకిందో లేదో తెలంగాణను చాలా ప్రాంతాలను తొలకరి పలుకరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా నడికుడిలో అత్యధికంగా 13.35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి.