Tirumala News: టీటీడీలో సమ్మెలు, నిరసనలు, ఆందోళనలపై నిషేధం పొడిగింపు.. ఎప్పటివరకు అంటే
తిరుమల తిరుపతి దేవస్థానంలో సమ్మెలు, నిరసనలు, ఆందోళనలపై నిషేధం పొడిగించారు. మరో ఆరు నెలలపాటు సమ్మెపై నిషేధాన్ని పొడిగిస్తూ....
తిరుమల తిరుపతి దేవస్థానంలో సమ్మెలు, నిరసనలు, ఆందోళనలపై నిషేధం పొడిగించారు. మరో ఆరు నెలలపాటు సమ్మెపై నిషేధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.. అత్యవసర సేవల నిర్వహణ చట్టం 1971 కింద దేవదాయ శాఖ ఆదేశాలు చేసింది. మే 24 నుంచి మరో 6 నెలలపాటు నిషేధం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుమలలో రాతి మండపమునకు వేంచేసిన శ్రీవారు
శ్రీవేంకటేశ్వరస్వామివారికి పరమభక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రాతి గృహమునకు ముందు ఉన్న రాతి మండపము వద్దకు గురువారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు విచ్చేశారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆస్థానం నిర్వహించారు. ప్రతి ఏడాది నరసింహ జయంతి తరువాత 10వ రోజున సహస్ర దీపాలంకార సేవ అనంతరం ఉత్తర మాడ వీధిలోని రాతి మండపము వద్దకు శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి ఊరేగింపుగా వేంచేయడం ఆనవాయితిగా వస్తుంది. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.
వేగంగా అలిపిరి నడకదారి పైకప్పు నిర్మాణం పనులు: అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే నడకదారి నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేస్తామని అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా తీవ్రత దృష్ట్యా జూన్ నెలలో రోజుకు 5 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మాత్రమే ఇచ్చామని అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు. రాత్రి 8 గంటలకు దర్శనం పూర్తి అవుతున్నందున 9 గంటలకు స్వామివారి ఏకాంత సేవ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా తీవ్రతను అంచనా వేశాక టీటీడీ చైర్మన్, ఈవో తో సమీక్షించి టికెట్ల సంఖ్య పెంచడమో, తగ్గించడమో నిర్ణయం తీసుకుంటామన్నారు.
అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే నడక దారి పైకప్పు నిర్మాణం పనులు వేగంగా చేయడం కోసం జూలై 30 వరకు భక్తులను అనుమతించడం లేదన్నారు. కరోనా వల్ల నడక దారిలో భక్తులు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారన్నారు. పైకప్పు పనులు వేగంగా పూర్తి చేయడానికి ఇదే సరైన సమయమనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుమలకు నడచి రావాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో రావాలని ఆయన కోరారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్, అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తామన్నారు. ఈ మార్గంలో అవసరమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.
Also Read: కొంచెం మోదం… కొంచెం ఖేదం.. నెట్టింట ఇదీ సమంత పరిస్థితి