AP News: కిచెన్‌లో స్..స్.. అంటూ భారీ శబ్ధం.. గ్యాస్ లీక్ అనుకునేరు.. వెళ్లి చూస్తే.. వామ్మో

వర్షాలు ఊపందుకున్నాయి. ఎండలతో అల్లాడిన ప్రజలే కాదు, మూగప్రాణులు కూడా కాస్త ఉపశమనం పొందుతున్నాయి. అయితో కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అటవీప్రాంతంలో, పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చేరుతున్నాయి.

AP News: కిచెన్‌లో స్..స్.. అంటూ భారీ శబ్ధం.. గ్యాస్ లీక్ అనుకునేరు.. వెళ్లి చూస్తే.. వామ్మో
Ap News
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 10, 2024 | 11:30 AM

వర్షాలు ఊపందుకున్నాయి. ఎండలతో అల్లాడిన ప్రజలే కాదు, మూగప్రాణులు కూడా కాస్త ఉపశమనం పొందుతున్నాయి. అయితో కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అటవీప్రాంతంలో, పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడుతున్నాయి. తాజాగా విశాఖలోని ఓ ఇంట్లో నాగుపాము చేరి ఆ ఇంటివారందరినీ పరుగులు పెట్టించింది.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

దువ్వాడ లో ని ఓ ఇంట్లో మహిళ వంట చేసేందుకు తమ వంటింట్లోకి వెళ్లారు. ఆమె వంటచేసేందుకు గ్యాస్‌ వెలిగిద్దామని ప్రయత్నించగా వింత శబ్దాలు వినిపించాయి. మొదట ఆమె గ్యాస్‌ లీక్ అవుతుందేమో అని చెక్‌ చేసింది. అయితే గ్యాస్‌ లీకవుతున్న దాఖలాలు కనిపించలేదు.. కనీసం గ్యాస్‌ స్మెల్‌ కూడా రాలేదు. కానీ గ్యాస్‌ లీకవుతున్నట్టుగా శబ్ధాలు మాత్రం వస్తున్నాయి. అంతకంతకూ ఆ శబ్దాలు పెరుగుతున్నాయి. అనుమానం వచ్చిన ఆమె మిగతా కుటుంబ సభ్యులను పిలిచారు. అందరూ కలిసి శబ్దాలు గ్యాస్‌ సిలిండర్‌ దగ్గరనుంచే వస్తున్నాయని గుర్తించి సిలిండర్ను పక్కకు తప్పించి చూసే ప్రయత్నం చేశారు. ఇంకేముంది? సిలిండర్‌ పక్కనే నాగుపాము చుట్టుకుని పడగవిప్పి బుసలు కొడుతూ కనిపించింది. అంతే ఒక్క ఉదుటన అక్కడ్నుంచి బయటకు పరుగులు తీశారు.

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

విషయం తెలిసి ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. కొందరు స్థానిక స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ కోపంతో బుసలు కొడుతున్న నాగుపామును ఎంతో చాకచక్యంగా బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇది చదవండి: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.3.5 లక్షలు ఉంటే ప్రపంచంలోని 50 శాతం మంది మీ కిందే..!
రూ.3.5 లక్షలు ఉంటే ప్రపంచంలోని 50 శాతం మంది మీ కిందే..!
అర్హత ఉన్నా గృహజ్యోతి అమలు అవ్వట్లేదా..? మీకే ఈ తీపి కబురు
అర్హత ఉన్నా గృహజ్యోతి అమలు అవ్వట్లేదా..? మీకే ఈ తీపి కబురు
ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తు పట్టారా? ఆర్జీవీకి బాగా క్లోజ్
ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తు పట్టారా? ఆర్జీవీకి బాగా క్లోజ్
ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను..
ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను..
ఈ డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం షుగర్ పేషెంట్స్‌కు ఓ వరం..
ఈ డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం షుగర్ పేషెంట్స్‌కు ఓ వరం..
చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం
చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం
క్రెడిట్‌ కార్డుపై అప్పు ఉన్న వ్యక్తి చనిపోతే బిల్లు కట్టాలా.?
క్రెడిట్‌ కార్డుపై అప్పు ఉన్న వ్యక్తి చనిపోతే బిల్లు కట్టాలా.?
అదరగొడుతున్న మోటోరోలా ఫోన్ ఫీచర్స్..రూ.18వేలకే కర్వ్‌డ్ డిస్‌ప్లే
అదరగొడుతున్న మోటోరోలా ఫోన్ ఫీచర్స్..రూ.18వేలకే కర్వ్‌డ్ డిస్‌ప్లే
నైవేద్యం ఆలస్యమైతే కన్నయ్య సన్నబడతాడు.. ఈ ఆలయం ఎక్కడో తెలుసా
నైవేద్యం ఆలస్యమైతే కన్నయ్య సన్నబడతాడు.. ఈ ఆలయం ఎక్కడో తెలుసా
నిరుద్యోగంపై కేంద్రం సమరం..ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు
నిరుద్యోగంపై కేంద్రం సమరం..ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు