ప్యాకెట్ పాలలో ప్రమాదకర కోలిఫామ్ బాక్టీరియా వీడియో
ఓ ప్రముఖ పాల కంపెనీ సహా మరికొన్ని బ్రాండ్లపై జరిపిన పరీక్షల్లో కోలిఫాం బ్యాక్టీరియా ఉందన్న వార్త కలకలం రేపుతోంది. ఓ బ్రాండెడ్ కంపెనీ పాలలో ప్రమాదకర కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయి ఎక్కువగా ఉందన్న వార్త వైరల్‌గా మారింది. ట్రస్టీ ఫైడ్ అనే స్వతంత్ర సంస్థ చేసిన టెస్ట్‌లో కోలిఫామ్ బయటపడింది. పాలలో కోలిఫామ్ స్థాయి FSSAI సూచించిన పరిమితి కంటే 98 రెట్లు ఎక్కువగా ఉందని తెలిసింది. మరో రెండు ప్రముఖ సంస్థల పాలల్లో కూడా కోలిఫామ్‌ను గుర్తించారు పరిశోధకులు .
కోలిఫామ్ బ్యాక్టీరియా.. మనిషి పేగులలో సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా. అదే పాలలో ఉందంటే మానవ వ్యర్థాల ద్వారా పాలు కలుషితమైనట్లే అని గగ్గోలు పెడుతున్నారు కొందరు. పాకెట్ పాల పరిశుభ్రత ప్రమాణాలు, ఆరోగ్య భద్రతపై చర్చ సోషల్ మీడియా లో సాగుతోంది. ఇవి కేవలం ఆరోపణలే అని ఆ కంపెనీలు ఖండిస్తున్నాయి. తమ ఉత్పత్తులన్నీ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. తయారీ వైఫల్యం లేదని, కానీ పంపిణీ సమయంలో కోల్డ్ చైన్‌లో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉండొచ్చంటున్నాయి. పాలు పితికే దశ నుంచి రవాణా, నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ సమయంలో కల్తీ జరగడానికి అవకాశాలు ఎక్కువంటున్నాయి. సాధారణంగా ప్యాకెట్ పాలను పాశ్చరైజేషన్ చేస్తారు. దాంతో హానికారక బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఆ తర్వాత సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయలేకపోవడంతో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే ప్యాకెట్ పాలను మరిగించకుండా వాడకూడదు.
మరిన్ని వీడియోల కోసం :
వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.

