Vijayawada: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ప్రతికూల వాతావరణం.. చక్కర్లు కొట్టిన బిల్‌గేట్స్ విమానం
విజయవాడ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిపోయింది.. దీంతో బిల్‌గేట్స్ విమానం ల్యాండింగ్‌కు వీలు లేక ఎయిర్‌పోర్ట్ చుట్టూ కాసేపు చక్కర్లు కొట్టింది. ఆపై ATC క్లియరెన్స్‌తో సేఫ్‌గా ల్యాండ్ అయింది. బిల్‌గేట్స్ బృందం సీఎం చంద్రబాబు సహా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో భేటీ అవ్వనున్నారు.

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విజిబిలిటీ బాగా తగ్గిపోయింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో విజయవాడకు రావాల్సిన బిల్‌గేట్స్ విమానం కూడా ఎయిర్‌పోర్ట్ చుట్టూ కాసేపు చక్కర్లు కొట్టింది. పొగమంచు కారణంగా పూర్ విజిబిలిటీ ఉండటంతో ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేేకపోవడంతో కాసేపు విజయవాడ చుట్టూ బిల్ గేట్స్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ATC ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో.. అరగంట తర్వాత విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. బిల్ గేట్స్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అతిథిగా బిల్ గేట్స్‌ను ప్రభుత్వం గౌరవించనుంది.
మరోసారి ఇద్దరు మిత్రుల మేలి కలియికకు వేళాయింది. టెక్నో దిగ్గజం, మైక్రో సాఫ్ట్ కో-ఫౌండర్ బిల్‌గేట్స్‌కు అమరావతి ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. అవసరంలో తోడుగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు అన్నట్లు.. గతంలో హైటెక్ సిటీ కోసం హైదరాబాద్‌లో.. అగ్రిటెక్ కోసం విశాఖలో.. ముచ్చటగా మూడోసారి అమరావతి వేదికగా అపూర్వ సమ్మేళనం జరగనుంది.
బిల్‌గేట్స్ బృందం సీఎం చంద్రబాబు సహా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో భేటీ అవుతారు.కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంజీవని డిజిటల్ హెల్త్ కేర్ ప్రాజెక్టుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య భద్రత అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రతి ఒక్కరికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా డిజిటిల్ హెల్త్ కార్డులను అందిస్తోంది. కుప్పం సహా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సత్‌ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని డిజిటిల్ హెల్త్ కేర్ సేవలు అందుబాటులో రానున్నాయి.
వాయిస్-సంజీవిని డిజిటిల్ హెల్త్ కేర్ పురోగతిపై అధికారులతో రివ్యూ చేస్తారు సీఎం చంద్రబాబు, బిల్‌గేట్స్. ఆ తరువాత అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. ఉండవల్లి వ్యవసాయ క్షేత్రంలో టెక్నాలజీతో చేపట్టే సాగు విధానాన్ని బిల్‌గేట్స్ పరిశీలిస్తారు.
సీఎం చంద్రబాబుతో కలిసి బిల్‌గేట్స్ ఆర్టీజీఎస్‌ను సందర్శిస్తారు. రియల్‌టైం గవర్నెన్స్ చర్చిస్తారు. స్వర్ణ ఆంధ్ర-2047 విజన్ ను బిల్‌గేట్స్‌కు వివరిస్తారు సీఎం చంద్రబాబు. మంత్రులు, అధికారులతో బిల్‌గేట్స్ సమావేశమవుతారు.
దావోస్ పర్యటనలో బిల్‌గేట్స్‌తో సమావేశమైన సందర్భంలో ఏపీ ఐటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన్ని కోరారు సీఎం చంద్రబాబు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు ఏపీని గేట్‌వేగా వుంటుందన్నారు మంత్రి లోకేష్. చాలా రోజుల తరువాత విజనరీ లీడర్‌తో సమావేశం కావడం సంతోషంగా వుందన్న బిల్‌గేట్స్.. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఏపీ పర్యటన చేపట్టారు.
ఇప్పటికే గ్రామీణ ఆరోగ్య సేవలు, వ్యాక్సినేషన్, మాతా శిశు సంరక్షణ రంగాల్లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. ఈ పర్యటన ద్వారా ఏపీలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు చేయూత నిచ్చే అవకాశం ఉంది.
