AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. అడవి రాజుకే సవాల్ విసిరిన ఆడసింహం.. కారణం తెలిస్తే షాకే..

సాధారణంగా అడవికి రాజు అంటే సింహం.. ఆ గర్జన వింటేనే మిగతా జంతువులకు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, సాక్షాత్తు ఆ మృగరాజుకే కళ్లలో కళ్లు పెట్టి ఎదురు నిలిచింది ఒక ఆడసింహం. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అయితే ఇది కేవలం గొడవ మాత్రమే కాదు.. దీని వెనుక ప్రకృతి దాచిన ఒక అద్భుతమైన మనుగడ రహస్యం ఉంది.

Viral Video: ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. అడవి రాజుకే సవాల్ విసిరిన ఆడసింహం.. కారణం తెలిస్తే షాకే..
Lioness Roars At Lion
Krishna S
|

Updated on: Feb 16, 2026 | 10:24 AM

Share

అడవికి రాజు సింహం. ఆ గంభీరమైన గర్జన వింటేనే జంతువుల గుండెలు ఆగిపోతాయి. కానీ అడవి రాజుకే ఎదురు నిలిచి, కళ్లలో కళ్లు పెట్టి గర్జించిన ఒక ఆడ సింహం వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. గుజరాత్‌లోని ప్రఖ్యాత గిర్ నేషనల్ పార్క్‌లో వెలుగుచూసిన ఈ అరుదైన దృశ్యాన్ని వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ ఉర్మిల్ ఝవేరి తన కెమెరాలో బంధించారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక మగ సింహం తన గంభీరమైన స్వరం వినిపిస్తుండగా, దానికి ఏమాత్రం తగ్గకుండా ఒక ఆడసింహం ఎదురు తిరిగింది. సింహం ముఖం దగ్గరకు వెళ్లి మరీ అత్యంత శక్తివంతంగా గర్జించింది. ఈ ఊహించని పరిణామానికి సాక్షాత్తు ఆ సింహరాజే కాసేపు వెనక్కి తగ్గి, శాంతించడం విశేషం.

మొదటి చూపులో ఇది రెండు క్రూర మృగాల మధ్య యుద్ధంలా అనిపించినా దీని వెనుక ఒక అద్భుతమైన ప్రకృతి రహస్యం దాగి ఉంది. వన్యప్రాణి నిపుణుల విశ్లేషణ ప్రకారం.. సంభోగం చేసే ముందు మగ సింహం యొక్క బలాన్ని, శక్తిని పరీక్షించడానికి ఆడ సింహాలు అనుసరించే మార్గం ఇది. తనతో జతకట్టబోయే మగ సింహం రేపు తనను, తన పుట్టబోయే పిల్లలను ఇతర శత్రువుల నుండి రక్షించగలదా లేదా? అని సింహరాశి ఇలా పరీక్ష పెడుతుందట. ఒకవేళ మగ సింహం ఈ గర్జనకు తట్టుకుని నిలబడితేనే, అది సమర్థవంతమైన భాగస్వామిగా ఆడ సింహం అంగీకరిస్తుంది.

ప్రకృతి అద్భుతం

ఈ శక్తివంతమైన గర్జనల పర్వం ముగిసిన తర్వాత రెండు సింహాలు ప్రశాంతంగా కలిసి కదలడం వీడియోలో చూడవచ్చు. ప్రకృతి మనుగడ వ్యూహాలు అత్యంత మనోహరంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయని ఈ వీడియోను షేర్ చేసిన ఉర్మిల్ ఝవేరి అన్నారు. ఆసియా సింహాలకు నెలవైన గిర్ అడవుల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించడం చాలా అరుదు.