AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీ ఆఫర్ అందుకున్న క్యూటీ.. నాగ చైతన్యకు జోడీగా ఎన్టీఆర్ బ్యూటీ..!

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తండేల్ లాంటి క్లైసిక్ హిట్ తర్వాత ప్రభాస్ ఇప్పుడు వృషకర్మ అనే ఆసక్తికర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.

క్రేజీ ఆఫర్ అందుకున్న క్యూటీ.. నాగ చైతన్యకు జోడీగా ఎన్టీఆర్ బ్యూటీ..!
Naga Chaitanya
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2026 | 10:03 AM

Share

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. మజిలీ, లవ్ స్టోరీ, తండేల్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ అలరిస్తున్నాడు. తండేల్ సినిమాలో నాగ్ చైతన్య నటన పీక్స్ అనే చెప్పాలి మత్యకారుడిగా అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ అక్కినేని హీరో..  వృషకర్మ అనే సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. కార్తిక్ వర్మ దండు గతంలో విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాను నాగ చైతన్య లైనప్ చేశాడు అని తెలుస్తుంది.

దర్శకుడు క్లాక్స్ డైరెక్షన్ లో నాగ చైతన్య ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. గతంలో బెదురులంక 2012 దర్శకుడిగా మారాడు క్లాక్స్. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. అందమైన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుందని తెలుస్తుంది.

రుక్మిణి వసంత్.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ అందాల భామ.. తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు తెలుగులో సినిమాలు చేయలేదు కానీ డబ్బింగ్ సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సప్తిసాగరాలు దాటి సినిమాతో పాపులర్ అయ్యింది. అలాగే రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా 2లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అక్కినేని నాగచైతన్య సరసన నటించే ఛాన్స్ అందుకుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై ఓ క్లారిటీ రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి