AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం.. 22 ప్రాజెక్టులకు ఓకే.. కీలక నిర్ణయాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక ప్రాజెక్టులకు, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) 8వ సమావేశంలో 39,473 కోట్ల రూపాయల పెట్టుబడికి ఆమోదం లభించింది. 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రణాళిక రూపొందించారు.భివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు.

CM చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం.. 22 ప్రాజెక్టులకు ఓకే.. కీలక నిర్ణయాలు!
Cm Chandrababu
SN Pasha
|

Updated on: Jul 18, 2025 | 6:57 AM

Share

ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టులు, ఉద్యోగాల కల్పనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. దీనికి అనుగుణంగానే స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకీ SIPB తీసుకున్న ఆ కీలక నిర్ణయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 8వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఆర్ధిక, రెవెన్యూ, పరిశ్రమలు, కార్మిక, వ్యవసాయ, టూరిజం, ఎనర్జీ శాఖా మంత్రులు పాల్గొన్నారు. ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న సంస్థలు, పెట్టుబడులపై చర్చించి.. ప్రోత్సాహకాలు, ఇతర ఇన్సెంటివ్స్‌లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన 39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటిలో పరిశ్రమలు – వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 22 ప్రాజెక్టులు SIPB ఆమోదం పొందిన లిస్టులో ఉన్నాయి. వాటి ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పనకు ప్లాన్‌ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టం వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఎకో సిస్టం ద్వారా ఆయా ప్రాజెక్టులతో స్థానికులు, అనుబంధ సంస్థలకూ లబ్ధి కలుగుతుందన్నారు.

పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ జరిగిన SIPB సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. SIPB 8వ మీటింగ్‌లో ఐటీసీ హోటల్స్ లిమిటెడ్, గ్రీన్ ల్యామ్ లిమిటెడ్, లారస్ ల్యాబ్స్, లులూ షాపింగ్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఏస్ ఇంటర్నేషనల్, అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయెల్స్, పీవీఎస్ గ్రూప్ లాంటి 22 ప్రముఖ సంస్థలు పెట్టుబడులకు ముందుకు రాగా ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి