Vande Bharat Express: సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవిగో..

సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. మే 17వ తేదీ నుంచి ఈ రైలు సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

Vande Bharat Express: సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవిగో..
కాగా, విజయవాడ-చెన్నై వందేభారత్ రైలుకు మొదట వేరే రూట్ ఎంచుకోగా.. తిరుపతి మీదుగా నడిపితే ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని రైల్వే శాఖ భావించింది. దీంతో వయా రేణిగుంట నడపాలని విజయవాడ డివిజన్ అధికారులు.. దక్షిణ మధ్య రైల్వేను కోరిన విషయం విదితమే.
Follow us
Ravi Kiran

|

Updated on: May 16, 2023 | 6:00 AM

సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. మే 17వ తేదీ నుంచి ఈ రైలు సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 20701 నెంబర్‌తో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ ట్రైన్.. ఇకపై ఉదయం 6.15 గంటలకు బయల్దేరి.. తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే వచ్చే ట్రైన్ 20702 నెంబర్‌తో తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి.. రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య 8.30 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం కాస్తా.. 8.15 గంటలకు తగ్గనుంది.

  • సికింద్రాబాద్-తిరుపతి(20701):

సికింద్రాబాద్ – ఉదయం 6.15 గంటలకు

నల్గొండ – ఉదయం 7.29 గంటలకు

గుంటూరు – ఉదయం 9.35 గంటలకు

ఒంగోలు – ఉదయం 11.12 గంటలకు

నెల్లూరు – ఉదయం 12.29 గంటలకు

తిరుపతి – మధ్యాహ్నం 2.30 గంటలకు

  • తిరుపతి – సికింద్రాబాద్(20702):

తిరుపతి – మధ్యాహ్నం 3.15 గంటలకు

నెల్లూరు – సాయంత్రం 4.49 గంటలకు

ఒంగోలు – సాయంత్రం 6.02 గంటలకు

గుంటూరు – రాత్రి 7.45 గంటలకు

నల్గొండ – రాత్రి 09.49 గంటలకు

సికింద్రాబాద్ – రాత్రి 11.30 గంటలకు

మరోవైపు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు అధిక ప్రయాణీకుల సామర్ధ్యంతో కూడా ప్రయాణించనుంది. ప్రస్తుతం ఈ రైలులో 8 కోచ్‌లు ఉండగా.. ఆ సంఖ్య మే 17 నుంచి 16కు పెరిగింది. దీంతో 530 సీట్లు కాస్తా 1,128కి పెరుగుతాయి. అటు ఈ ట్రైన్ పట్టాలెక్కిన దగ్గర నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఏప్రిల్‌లో ఆక్యుపెన్సీ 131 శాతం కాగా.. మేలో 135 శాతంగా నమోదైంది. ఇక తిరుపతి నుంచి వచ్చే వందేభారత్ రైలుకు కూడా ఏప్రిల్‌లో 136 శాతం, మేలో 138 శాతం అక్యుపెన్సీ నమోదైంది. ఇలా ప్రయాణీకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో రైల్వే శాఖ.. ఈ ట్రైన్ కోచ్‌లను పెంచడంతో పాటు వేగాన్ని సైతం పెంచింది. తద్వారా ఇకపై సికింద్రాబాద్-తిరుపతి మధ్య 8.30 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం.. 8.15 గంటలకు తగ్గనుంది.