Andhra Pradesh: తృటిలో తప్పిన పెను ప్రమాదం..వర్షాల ధాటికి కుప్పకూలిన పాఠశాల భవనం..
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సుంకరమెట్ట పంచాయతీ పిరిబంద గ్రామంలో ప్రాధమిక పాఠశాల భవనం..

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సుంకరమెట్ట పంచాయతీ పిరిబంద గ్రామంలో ప్రాధమిక పాఠశాల భవనం కూలిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు నాని శిధిలమైన స్కూల్ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆదివారం సెలవు రోజు కావడంతో పిల్లలకు పెద్ద ప్రమాదం తప్పినట్టే అయింది. తలచుకుంటేనే గగుర్పాటుకు గురిచేసిన ఈ స్కూల్ బిల్డింగ్‌లో దసరా సెలవుల ముందు వరకు అదే భవనంలో తరగతులు నిర్వహించారు.
రేపటినుంచి అదే భవనానికి పిల్లలు హాజరు కావాల్సి ఉంది. గతంలోనే ఈ పాఠశాల భవనం శిథిలావస్థపై స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటిడిఎ అధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాథమిక పాఠశాలలో 30 మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందించిన స్కూల్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాలు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
