సచివాలయంలో మర్యాద ఇవ్వలేదని సర్పంచ్ కొడుకు ఏం చేశాడంటే..
సచివాలయానికి వస్తే కనీసం మర్యాదకు కూర్చోమని కూడా చెప్పలేదని సర్పంచ్ కుమారుడు వీరంగం సృష్టించారు. అంతటితో ఆగలేదు బండ బూతులు తిడుతూ చెప్పు తీసుకొని దాడి చేయబోయారు. సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం లోచర్ల సచివాలయంలో సర్పంచ్ గంగమ్మ కుమారుడు నారాయణస్వామి నానా హంగామా సృష్టించారు. సచివాలయానికి వస్తే సర్పంచ్ కుమారుడు అన్న గౌరవం లేకుండా కనీస మర్యాద కూడా ఇవ్వలేదని ఆర్ఐ దుర్గేష్ పై దాడికి ప్రయత్నించారు.

సచివాలయానికి వస్తే కనీసం మర్యాదకు కూర్చోమని కూడా చెప్పలేదని సర్పంచ్ కుమారుడు వీరంగం సృష్టించారు. అంతటితో ఆగలేదు బండ బూతులు తిడుతూ చెప్పు తీసుకొని దాడి చేయబోయారు. సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం లోచర్ల సచివాలయంలో సర్పంచ్ గంగమ్మ కుమారుడు నారాయణస్వామి నానా హంగామా సృష్టించారు. సచివాలయానికి వస్తే సర్పంచ్ కుమారుడు అన్న గౌరవం లేకుండా కనీస మర్యాద కూడా ఇవ్వలేదని ఆర్ఐ దుర్గేష్ పై దాడికి ప్రయత్నించారు. సచివాలయానికి వస్తే కనీసం మర్యాద ఇవ్వడం కూడా తెలియదా అంటూ బండ బూతులు తిట్టారు.
అంతటితో ఆగకుండా చెప్పుతో దాడి చేసేందుకు ఆర్ఐపై దూసుకెళ్లారు. అడ్డుకోబోయిన సచివాలయ ఉద్యోగులపై బూతుల దండకం అందుకున్నారు. సచివాలయం నుంచి బయటకు వస్తే నీ అంతు చూస్తానంటూ చెప్పు చేతిలో పట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. సర్పంచ్ కుమారుడి హఠాత్ పరిణామంతో అధికారులు, స్థానికులు హడలిపోయారు. అతనితో వచ్చిన వారు నచ్చజెప్పి బయటకు తీసుకెళ్లారు. సుమారు 20 నిమిషాలపాటు సచివాలయ సిబ్బందిపై దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు సర్పంచ్ కుమారుడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




