Andhra Pradesh: అక్కడి ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. నిరుద్యోగులకు కూడా..

ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పీఆర్ సీ ప్రకారం అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు వేతనాలు అందుకుంటారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. న్యాయ అంశాలు, నిబంధనలన్నీ..

Andhra Pradesh: అక్కడి ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. నిరుద్యోగులకు కూడా..
Botsa Satyanarayana
Follow us

|

Updated on: Sep 11, 2022 | 9:44 AM

Andhra Pradesh: ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పీఆర్ సీ ప్రకారం అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు వేతనాలు అందుకుంటారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. న్యాయ అంశాలు, నిబంధనలన్నీ పరిశీలించాక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఉంటుందని, ఈ విషయంలో నెలరోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. విజయనగరంలో శనివారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(APGEA) 4వ వార్షికోత్సవ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడానికే తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. తాము ఇచ్చిన ఎన్నికల హామీల్లో 95 శాతం నెరవేర్చామని, ఐదు శాతం మాత్రమే అనివార్య కారణాల వల్ల అమలు కాలేదన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములమన్న భావనతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు. పెండింగ్‌ డీఏల సమస్య తొందరలోనే పరిష్కారమవుతుందన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(PHC) మొదలుకుని అన్నిస్థాయిల్లోని ఆస్పత్రుల్లో పోస్టులన్నీ డిసెంబర్‌ ఆఖరుకు భర్తీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా అదే సమయానికి భర్తీ చేస్తామని  వెల్లడించారు. తెలంగాణ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఎటువంటి పెన్షన్‌ స్కీం వర్తింపచేయాలన్నది రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరిస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలుగతామని చెప్పారు. ఉద్యోగుల సంకేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధన్యతనిస్తోందన్నారు. అసత్య ప్రచారాలను ఏ ఒక్కరూ నమ్మవద్దన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..