Viral Video: వార్నీ.. పైకి చూస్తే ఖాళీ లారీనే.. లోపల యవ్వారం మామూలుగా లేదుగా..

అడ్డదారులు తొక్కడానికి అరవై మార్గాలు అంటారు.. అవును.. ఎందుకంటే గంజాయి స్మగ్లర్లు పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పుష్ప సినిమా స్టైల్‌ను అనుసరిస్తూ దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అలా అయితే.. దోరుకుతున్నాం అని పుష్ప సినిమాకు మించిన స్టైల్ లో స్మగ్లింగ్ కు ప్లాన్స్ చేసుకుంటున్నారు.

Viral Video: వార్నీ.. పైకి చూస్తే ఖాళీ లారీనే.. లోపల యవ్వారం మామూలుగా లేదుగా..
Crime News
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 26, 2024 | 3:39 PM

అడ్డదారులు తొక్కడానికి అరవై మార్గాలు అంటారు.. అవును.. ఎందుకంటే గంజాయి స్మగ్లర్లు పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పుష్ప సినిమా స్టైల్‌ను అనుసరిస్తూ దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అలా అయితే.. దోరుకుతున్నాం అని పుష్ప సినిమాకు మించిన స్టైల్ లో స్మగ్లింగ్ కు ప్లాన్స్ చేసుకుంటున్నారు. తాజాగా, అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీసులు పట్టుకున్న ఓ లారీ తనిఖీ చేస్తే ఖాకీలకే మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే.. పైకి లారీ ఖాళీగా కనిపిస్తోంది. డ్రైవర్ తరుణ్ తోపాటు అందులో మరొకడున్నాడు. వాడి పేరు మల్లేష్ రూట్ గైడ్.. అన్న మాట.. లారీ వెనుక తొట్టి కూడా ఖాళీగానే కనిపిస్తోంది.. ఇంతలోనే పోలీసులకు ఎక్కడో చిన్న అనుమానం కలిగింది. ఆపి తనిఖీ చేస్తే ఎక్కడా ఏమి చిక్కలేదు. అయినా పోలీసులకు లారీని వదలకూడదని అనిపించింది. ఎందుకంటే లారీ డ్రైవర్ మాటల్లో పొంతన లేదు.. వారి తీరు కూడా ఏదో తేడాగా కనిపిస్తోంది.. దీంతో ఓ కానిస్టేబుల్ లారీ పైకి ఎక్కాడు. అక్కడ ఉన్న తార్పాలిన్ తీసి చూస్తే.. డ్రైవర్ క్యాబిన్ పైన ఓ రహస్య అర ఉంది.

Ganja

అది చూడగానే పోలీసులు అవాక్కయ్యారు.. అది చూస్తుండగానే.. ఆ వెంటనే పోలీసులకు మరో అర కూడా అక్కడే బయటపడింది. లారీ క్యాబిన్ పైభాగం నుంచి డ్రైవర్ క్యాబిన్ కు, వెనక ఉన్న తొట్టికి మధ్య మరో రహస్య అరను కూడా ఏర్పాటు చేశారు.. అందులో ఫుల్లుగా గంజాయి నింపి ఉంది. గంజాయి తీసే కొద్దీ లోపల బాక్సుల కొద్ది ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా… 912 కిలోల గంజాయి బయటపడింది. దాని విలువ బహిరంగ మార్కెట్లో కోటి పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వీడియో చూడండి..

ఏవోబీ నుంచి వరంగల్ కు..

సబ్బవరం మండలం గుల్లేపల్లిలో తనిఖీలు నిర్వహించగా.. గంజాయ్ స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఒడిశా మల్కానగిరి నుండి వరంగల్ కు గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఐదుగురు పాత్ర ఉన్నట్టు గుర్తించారు. నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు, 15వేల నగదు, సీజ్ చేసినట్లు ఎస్పీ దీపిక తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..