ఏపీ మంత్రులు మేకపాటి, అనిల్ కుమార్‌లకు తప్పిన పెను ప్రమాదం
ఏపీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లకు పెను ప్రమాదం తప్పింది. వారి కాన్వాయ్‌లోని ఓ కారు డ్రైవర్ నెల్లూరు జిల్లా మర్రిపాడు

AP Ministers Road Accident: ఏపీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లకు పెను ప్రమాదం తప్పింది. వారి కాన్వాయ్‌లోని ఓ కారు డ్రైవర్ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్‌ప్లాజా వద్ద సడన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్‌లోని మిగిలిన వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీ కొన్నాయి. ఈ క్రమంలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు మంత్రులకు ఏం కాలేదు. కృష్ణాపురం వద్ద హై లెవల్ కెనాల్ ఫేజ్ 2 పైలాన్ ప్రారంభోత్సవానికి మంత్రులు వెళుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. కాపేపటి తరువాత మంత్రులు అక్కడి నుంచి తిరిగి బయల్దేరి కార్యక్రమానికి వెళ్లారు.
Read More:
కమెడియన్ పుట్టినరోజు నాడే కుమారుడు మృతి.. భావోద్వేగ పోస్ట్
Andhra Pradesh NewsAP ministersAP Ministers Road AccidentMinister Anil Kumar YadavMinister convey accident