వ్యవసాయం విలువ తెలుసు : సీఎం జగన్

వ్యవసాయం విలువ తెలుసు : సీఎం జగన్

జనవరికల్లా సంగం, నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని సీఎం జగన్ చెప్పారు. నెల్లూరు జిల్లాలో సోమశిల హైలెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశ పనులకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి...

Ram Naramaneni

|

Nov 09, 2020 | 3:06 PM

జనవరికల్లా సంగం, నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని సీఎం జగన్ చెప్పారు. నెల్లూరు జిల్లాలో సోమశిల హైలెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశ పనులకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు.  పెన్నా నది నీటిని సద్వినియోగం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎం‌ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నీరు, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని తెలిపారు.  జలయజ్ఞం పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

2020-21లో 6 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.  2022 ఖరీఫ్‌కు నీరిచ్చేలా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని సీఎం మాటిచ్చారు. నీటి విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం వద్ద రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. కృష్ణాపురం వద్ద కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్,‌ గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.

Also Read : మారేడిమిల్లి చేరుకున్న బన్నీ, రేపట్నుంచి షూటింగ్ షురూ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu