మారేడిమిల్లి చేరుకున్న బన్నీ, రేపట్నుంచి షూటింగ్ షురూ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాక్ డౌన్ అనంతరం షూటింగ్ షురూ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాక్ డౌన్ అనంతరం షూటింగ్ షురూ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ తాజా షెడ్యూల్ కోసం ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లిని చేరుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఈనెల 10 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. చిత్రీకరణకు డమ్మీ ఎర్ర చందనం దుంగలు, రాళ్లను సిద్ధం చేశారు. మాడుగులలో హెచ్ఎంటీసీ ఫారం వద్ద నిర్మించిన వుడ్స్ కాటేజిల్లో మూవీ టీమ్ బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే హీరో అల్లు అర్జున్ ఉండేందుకు ప్రత్యేక బస్సు సిద్దం చేశారు. బయట వారు ఎవరూ షూటింగ్ లోకేషన్ వద్దకు ప్రవేశించకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : తెలుగు పరిశ్రమ నాకు ప్రాణ సమానం : పూజా హెగ్డే